టాలెంట్ చూపిస్తున్న అల్లు అర్హ, గణపతిని తయారు చేసిన అల్లు అర్జున్ గారాలపట్టి
మరోసారి టాలెంట్ చూపించింది.. అల్లువారి గారాల పట్టి అర్హ. ఇప్పటికే స్టార్ కిడ్ గా బాగా ఫేమస్ అయిన ఈ చిన్నారి. తాజాగా గణేష్ పండక్కి సర్ ప్రైజ్ ఇచ్చింది. అర్హా టాలెంట్ చూసి... అల్లుఅర్జున్, స్నేహారెడ్డి తెగ ముచ్చటపిపోతుననారు.

సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి.. స్టార్స్ తో పాటు.. స్టార్ కిడ్స్ కూడా బాగా పాపులర్అవుతూ వస్తున్నారు. వారు కూడా టాలెంట్ చూపిస్తూ.. ఏదో ఒక రకంగా ఫేమస్ అవుతున్నారు. తమ సొంత టాలెంట్ తో సెలబ్రిటీ స్టేటస్ ను సాధిస్తున్నారు. ఆలిస్ట్ లో మహేష్ బబు పిల్లలతో పాటు అల్లు అర్జున్ పిల్లలు కూడా ఉన్నారు మరీ ముఖ్యంగా బన్నీ గారాల పట్టి అల్లు అర్హా అయితే.. ఏకంగా రెండు మూడు సినిమాలు కూడా చేసేసింది ఇప్పటికే.ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన టాలెంట్ చూపిస్తూ ఉంటుంది చిన్నారి హర్హ.
అంతే కాదు అర్హా అయాన్ ఇద్దరు చేసే అల్లరి.. వారికి సబంధంచిన అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో శేర్ చేస్తుంటారు అల్లు అర్జున్, స్నేహా రెడ్డి.అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిన్నారి ఇంత చిన్న వయసులోనే విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇక ఈమె సమంత నటించిన శాకుంతలం సినిమాలో బాలనటిగా సందడి చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక అల్లు అర్హ ఈ సినిమాలో తన నటనతో ఆడియన్స్ ను ఆకట్టుకుంది బ్యూటీ.
అర్హకు సంబంధించిన ఎన్నో ముద్దు ముద్దు వీడియోలను క్యూట్ వీడియోలు ఇప్పటికే వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక తాజాగా తన టాలెంట్ ను మరోసారి చూపించింది చిన్నారిఅర్హ. వినాయక చవితి పండుగ సందర్భంగా అర్హ వినాయకుడిని ఎంతో అందంగా తయారు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.
అర్హ తన చిన్ని చిన్ని చేతులతో బొజ్జ గణపయ్యను ఎంతో ముద్దుగా చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసినటువంటి ఎంతోమంది అర్హ టాలెంట్ కి ఫిదా అవుతున్నారు. అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా సీక్వెల్స్ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15 వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది.