Asianet News TeluguAsianet News Telugu

సౌత్ లో రజినీకాంత్ ను క్రాస్ చేసిన అల్లు అర్జున్, ఐకాన్ స్టార్ రేర్ రికార్డ్..

పుష్పతో గ్లోబల్ స్టార్ గామారిపోయాడు అల్లు అర్జున్. ఇక పుష్ప2 తో ఆస్కార్ పై గురిపెట్టాడు. ఇక తాజాగా బన్నీ కి సబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ విషయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నే క్రాస్ చేశాడట ఐకాన్ స్టార్. 
 

Allu Arjun Crossing Rajinikanth Remuneration In South JMS
Author
First Published Nov 28, 2023, 3:57 PM IST

పాన్ ఇండియా సినిమాల సంసృతి వచ్చిన తరువాత సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. స్టార్ డమ్ తో పాటు.. రెమ్యూనరేషన్స్ విషియంలో ఎప్పటికప్పుడు అంచనాలు తారుమారు అవుతున్నాయి. అయితే ప్రస్తతం ఇండస్ట్రీలు. అందులోను టాలీవుడ్ ఈరేంజ్ లో ఉండటానికి... మన హీరోలకు ఇంత డిమాండ్ రావడానికి కారణం రాజమౌళినే అని అందరికి తెలుసు. ఈక్రమంలో స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు కూడా ఒక్కొక్కరిగా సెంచరీలు దాటుతూ వస్తున్నారు. ఇంతకు ముందు ఒక్క రజినీకాంత్ మాత్రమే 100 కోట్ల రెమ్యూనరేషన్ హీరోగా ఉండగా.. ఆయన్ను దాటుతూ.. తెలుగు హీరోలు దూసుకుపోతున్నారు. 

తాజాగా రజనీకాంత్ రికార్డ్ ను క్రాస్ చేసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరికొత్త రికార్డ్ ను నెలకొలిపారు.  తమిళ తలైవా.. సూపర్ స్టార్  రజనీకాంత్ మాత్రం ఇప్పటివరకు నూట ముప్పై కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని తెలుస్తుంది. ఇలా రజినీకాంత్ ఒక్క సినిమాకు 130 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకు సౌత్ ఇండస్ట్రీలోని అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్నటువంటి హీరోగా పేరు పొందారు.

అయితే తాజాగా ఈ రికార్డును అల్లు అర్జున్  బ్రేక్ చేసినట్టు తెలుస్తోంది.  ప్రస్తుతం రజనీకాంత్ కు మించి అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారని సమాచారం.  పుష్ప సినిమాతో వరల్డ్ వైడ్ గా క్రేజ్ సాధించాడు బన్నీ. ఇక పుష్ప సీక్వెల్ తో అంతకు మించి సాధించి.. ఆస్కార్ కు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా బన్నీతె పాటు టీమ్ అంతా కష్టపడుతున్నారు. అయితే ఈసినిమాకు బన్నీ భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. పుష్పను తెరకెక్కించే దర్శకుడు సుకుమార్ సీక్వెల్ సినిమాకు 100 కోట్ల వరకూ తీసుకోబోతున్నారన్నన్యూస్ రీసెంట్ గా వినిపించింది. ఇక ఈమూవీ హీరోగా బన్నీ 150 కోట్లు వసూలు చేయనున్నారట. 

అయితే ఈ రెమ్యూనరేషన్ లోనే చిన్న ట్విస్ట్ ఉంది. ప్రస్తుతం  అల్లు అర్జున్ తీసుకొనే రెమ్యూనరేషన్  సంచలనంగా మారింది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ తో పాటు సినిమాలో లాభాలలో 30% వాటా తీసుకోబోతున్నారని తెలుస్తుంది. ఈ విధంగా పుష్ప సీక్వెల్ సినిమా కోసం అల్లు అర్జున్ ఏకంగా 150 కోట్ల వరకు అందుతాయని అంచనా.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios