క్షణం, గూఢాచారి లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్‌ హీరోగా తెరకెక్కిన మరో థ్రిల్లర్ మూవీ ఎవరు. పీవీపీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు వెంకట్‌ రామ్‌జీ దర్శకుడు.  ఆగస్టు 15న రిలీజ్‌ విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాను చూసిన స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు.

‘‘ఎవరు’ చిత్రం టీమ్ కి అభినందనలు..  నిన్న రాత్రే సినిమా చూశాను. ప్రతి సీన్ ఎంతో ఇంట్రస్టింగ్ గా చిత్రీకరించారు. సినిమా బాగా నచ్చింది. కథ, టెక్నికల్ గానూ చాలా బాగుంది. రెజీనా, అడివి శేష్‌ చాలా బాగా నటించారు. చిత్రమ టీమ్ కి అభినందనలు.’ అంటూ ట్వీట్‌ చేశారు. 

ఇక ఈ చిత్రం రిలీజ్ రోజు మార్నింగ్ షో నుంచే ఈ చిత్రానికి మంచి హిట్ టాక్ వచ్చింది.  దానికి తోడు ఈ చిత్రాన్ని విభిన్న రీతిలో ప్రమోషన్స్ చేయటం కూడా కలిసివచ్చింది. ఆగస్టు 14 రాత్రి మీడియాకు చూపెట్టడంతో...తెల్లారేసరికల్లా పాజిటివ్ రివ్యూలు రావటం, హిట్ టాక్ రావటం వెంట వెంటనే జరిగిపోయాయి.దానికి తగ్గట్లు ..అదే రోజు రిలీజైన రిలీజైన శర్వా చిత్రం రణరంగం డిజాస్టర్ కావటం కూడా కలిసొచ్చింది. 

ఈ చిత్రంలో అడివి శేషు ‘విక్రమ్‌’ అనే తమిళ పోలీసు అధికారి పాత్రలో కనిపించారు.  ఈ సినిమా స్పానిష్ సినిమా రీమేక్‌. 2007లో  రిలీజ్‌ అయిన ది ఇన్విజిబుల్‌ గెస్ట్ కు ఎవరుగా మార్చారు. ఇదే సినిమాను బాలీవుడ్‌లో అమితాబ్‌ బచ్చన్‌, తాప్సీల కాంబినేషన్‌లో బద్లా పేరుతో రీమేక్‌ చేశారు.  శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రాన్ని పీవీపీ సినిమా సంస్థ నిర్మించింది.