స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న చిత్రం 'అల.. వైకుంఠపురములో'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకుడు. వీరిద్దరిది సూపర్ హిట్ కాంబినేషన్. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు వచ్చాయి. దీనితో అల.. వైకుంఠపురములోపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. 

సోషల్ మీడియాలో బన్నీ అభిమానులతో చేరువగా ఉంటాడు. అత్యధిక ఫాలోవర్స్ కలిగిన స్టార్లలో బన్నీ ఒకడు. తాజాగా బన్నీ ఓ ట్వీట్ చేస్తూ తాను కొత్త కారు కొన్న విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. కొత్త రేంజ్ రోవర్ కారుని బన్నీ కొన్నాడు. 'మా ఇంట్లోకి కొత్త కారు వచ్చింది. దానికి నేను 'బీస్ట్' అని పేరు పెట్టా. నేను ఏ వస్తువు కొన్నా దానిని కృతజ్ఞతగానే భావిస్తా' అని బన్నీ ట్వీట్ చేశాడు. 

అల్లు అర్జున్ చివరగా నటించిన చిత్రం నా పేరు సూర్య. ఆ చిత్రం నిరాశపరిచింది. ప్రస్తుతం నటిస్తున్న అల.. వైకుంఠపురములో చిత్రాన్ని హారిక అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.