తగ్గేదే లే.. డేవిడ్ వార్నర్ కి అల్లు అర్జున్ బర్త్ డే విషెస్
ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇండియాలో ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల్లో విశేషమైన అభిమానులని సొంతం చేసుకున్నాడు. వార్నర్ గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కి ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.

ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇండియాలో ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల్లో విశేషమైన అభిమానులని సొంతం చేసుకున్నాడు. వార్నర్ గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కి ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో వార్నర్ తెలుగు హీరోలని అనుకరిస్తూ డ్యాన్స్ లు చేయడం, డైలాగ్స్ చెప్పడం లాంటి ఇన్స్టా రీల్స్ చేయడంతో బాగా పాపులర్ అయ్యాడు.
ఆఫ్ ది గ్రౌండ్ కూడా వార్నర్ కి భలే క్రేజ్ ఉంది. ఇక అల్లు అర్జున్ సంచలన చిత్రం పుష్పలో ఉన్న మ్యానరిజమ్స్ ని వార్నర్ అనుకరించినట్లుగా ఇంకెవరూ చేయలేదనే చెప్పాలి. తగ్గేదేలే అనే అభినయం.. శ్రీవల్లి అంటూ సాంగ్ లో డ్యాన్స్ ఇలా వివిధ రకాలుగా డేవిడ్ వార్నర్ రీల్స్ చేస్తూ పాపులర్ అయ్యాడు.
నేడు వార్నర్ తన 37వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డేవిడ్ వార్నర్ కి బర్త్ డే విషెస్ తెలిపాడు. వార్నర్ తగ్గేదేలే అనే అభినయం ఉన్న ఫోటో షేర్ చేస్తూ బన్నీ ఇలా విష్ చేశాడు. క్రికెట్ సూపర్ స్టార్ డేవిడ్ వార్నర్ కి జన్మదిన శుభాకాంక్షలు. నీ కలలు అన్ని నెరవేరాలని కోరుకుంటున్నా అంటూ అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపాడు.
ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ లలో కూడా వార్నర్ పుష్ప మ్యానరిజమ్స్ వదిలిపెట్టడం లేదు. సెంచరీ చేసినతర్వాత తగ్గేదే లే అంటూ మ్యానరిజం చూపించడం.. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు పుష్ప తరహాలో డ్యాన్స్ చేస్తూ అలరిస్తున్నాడు. ఈ ఏడాది అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంలో కూడా వార్నర్ తన ముద్దుల కూతురుతో కలసి బర్త్ డే విషెస్ చెప్పిన సంగతి తెలిసిందే.