Asianet News TeluguAsianet News Telugu

`పుష్ప2`పై అల్లు అర్జున్‌ కొత్త స్టేట్‌మెంట్‌.. ఫ్యాన్స్ ఊగిపోతున్నారు!

అల్లు అర్జున్‌ తాను ప్రస్తుతం నటిస్తున్న `పుష్ప 2` చిత్రంపై అదిరిపోయే స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. `మంగళవారం` మూవీ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన ఫ్యాన్స్ ఊగిపోయే విషయం చెప్పారు.

allu arjun big statement on pushpa2 and gave update arj
Author
First Published Nov 12, 2023, 9:49 AM IST

అల్లు అర్జున్‌(AlluArjun) ప్రస్తుతం `పుష్ప2`(Pushpa2)లో నటిస్తున్నారు. సుకుమార్‌ రూపొందిస్తున్న ఈ మూవీపై భారీగానే అంచనాలున్నాయి. `పుష్ప` మూవీ హిట్‌ కావడంతో రెండో పార్ట్ కోసం అంతా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఇది వచ్చే ఏడాది ఆగస్ట్ లో రాబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ జరుపుకుంటోంది. కథ పరంగా సుకుమార్‌ మరింత కేర్‌ తీసుకుంటున్న నేపథ్యంలో చిత్రీకరణ చాలా నెమ్మదిగా సాగుతుంది. అయితే తాజాగా ఈ మూవీపై అల్లు అర్జున్‌ అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చారు. తాజాగా బన్నీ `మంగళవారం`(Mangalavaaram) ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి గెస్ట్ గా వచ్చారు. సినిమాపై ప్రశంసలు కురిపించారు.

ఈ సందర్భంగా ఫ్యాన్స్ అప్‌డేట్‌ చెప్పాలని డిమాండ్‌ చేస్తుండటంతో ఆయన `పుష్ప 2`పై షూటింగ్‌ అప్‌డేట్‌ చెప్పారు. ప్రస్తుతం ఆర్‌ఎఫ్‌సీ(రామోజీ ఫిల్మ్ సిటీ)లో చిత్రీకరణ జరుపుతున్నట్టు తెలిపారు. అందులో భాగంగా జాతర సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఇది హైలైట్‌గా ఉంటుందని తెలుస్తుంది. జాతరలో వచ్చే యాక్షన్‌ సీన్లు మైండ్‌ బ్లోయింగ్‌ అనేలా ఉంటాయని వార్తలొచ్చాయి. ఆ ప్రకారంగానే ప్రస్తుతం ఆయా సీన్లు చిత్రీకరిస్తున్నారు. అందుకోసం బన్నీ తన గోళ్లకి పెయింట్‌ పెట్టుకున్నారని చెప్పారు. ఏకంగా వేళ్లు కూడా చూపించారు. అయితే రెండో పార్ట్  ఫస్ట్ లుక్‌లో బన్నీ అమ్మోరు తల్లి అవతారంలో కనిపించారు. అర్థనారిగానూ కనిపించారు. 

ఈ నేపథ్యంలో ఆ లుక్‌ జాతరలోనిదే అని తెలుస్తుంది. ప్రత్యర్థులను అంతం చేసేందుకు బన్నీ ఇలా గెటప్‌ మార్చినట్టు సమాచారం. ఇది సినిమాకే హైలైట్‌గా ఉంటుందని టాక్‌. ఇక `మంగళవారం` ఈవెంట్‌లో ఆయన స్పీచ్‌ ముగింపులో అదిరిపోయే స్టేట్ మెంట్‌ ఇచ్చారు. `పుష్ప` సినిమా తర్వాత అందరు తగ్గేదెలే అంటున్నారు. కానీ `పుష్ప2` మాత్రం అస్సలు తగ్గేదెలే అంటూ వ్యాఖ్యానించారు. సినిమాపై భారీ అంచనాలను పెంచేశారు. ఒక్క స్టేట్‌మెంట్‌తో ఫ్యాన్స్ ఊగిపోయారు.

ఇక రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్న ఈ మూవీలో అనసూయ, సునీల్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఫహద్‌ ఫాజిల్‌ నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్ట్ 15న విడుదల చేయబోతున్నారు. `పుష్ప`లో ఎర్రచందనం స్మగ్లర్‌గా పుష్ప ఎదగడాన్ని చూపించారు. పార్ట్ 2లో పుష్పరాజ్‌ రూలింగ్‌ని చూపించబోతున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios