స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోమారు తన స్నేహపూర్వకమైన భావాన్ని చాటుకున్నాడు. అల్లు అర్జున్ ఎంత స్టార్ గా ఎదిగినా అందరితో సెట్స్ లో సరదాగానే ఉంటాడు. బన్నీ తాజాగా ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఆ వివాహం బంధువులతో, స్టార్ సెలబ్రిటీలదో కాదు. ఓ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ వివాహ వేడుక అది. అసిఓస్టెంట్ కొరియోగ్రాఫర్ శిరీష్ వివాహం హైదరాబాద్ లో నేడు జరిగింది. 

ఈ వివాహ వేడుకకు బన్నీ హాజరై వధూవరులని ఆశీర్వదించాడు. శిరీష్ తన కెరీర్ ని గీత ఆర్ట్స్ సంస్థలోనే ప్రారంభించాడు. శిరీష్ లోని డాన్స్ ప్రతిభని గమనించిన బన్నీ స్వయంగా అతడికి ట్రైనింగ్ ఇప్పించాడు. దీనితో శిరీష్ ప్రస్తుతం అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. శిరీష్ వివాహ వేడుకలో బన్నీ సందడి చేస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. 

ఇదిలా ఉండగా అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తయింది. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.