AAA multiplex: తన వరల్డ్ క్లాస్ మల్టీప్లెక్స్ పూజా కార్యక్రమాల్లో అల్లు అర్జున్..
అల్లు అర్జున్ సైతం మల్టీ ప్లెక్స్ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. బన్నీ ఓ భారీ థియేటర్‌ని నిర్మించబోతున్నట్టు ఆ మధ్య వార్తలొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం నాడు ఆ మల్టీప్లెక్స్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
స్టార్ హీరోలు బిజినెస్సుల్లోకి అడుగుపెడుతున్నారు. రెమ్యూనరేషన్‌గా వచ్చిన డబ్బుని వ్యాపారాల్లో పెట్టి రెండు చేతులా సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు. మరో వైపు సినిమా అనే ప్యాషన్ కోసం ప్రొడక్షన్ రూపంలో తమ అభిరుచిని చాటుకుంటున్నారు. చిన్న బడ్జెట్ చిత్రాలు నిర్మించడంతోపాటు, తమ సినిమాల్లో భాగమవుతున్నారు. మరోవైపు మల్టీప్లెక్స్ ల నిర్మాణంలో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే మహేష్‌బాబు, విజయ్ దేవరకొండ మల్టీప్లెక్స్ బిజినెల్‌లోకి అడుగుపెట్టారు.
ఇప్పుడు అల్లు అర్జున్(Allu Arjun) సైతం మల్టీ ప్లెక్స్ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. బన్నీ ఓ భారీ థియేటర్‌ని నిర్మించబోతున్నట్టు ఆ మధ్య వార్తలొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆ మల్టీప్లెక్స్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం హైదరాబాద్‌లో తన మల్టీప్లెక్స్ కి సంబంధించి నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు Allu Arjun. ఈ మల్టీప్లెక్స్ ని ఆయన ఏషియన్ సినిమాస్‌తో కలిసి నిర్మిస్తున్నారు. `ఏషియన్ అల్లు అర్జున్`(ఏఏఏ)(AAA Cinemas) పేరుతో ఇది మల్టీప్లెక్స్ థియేటర్ నిర్మించబడుతుంది. సునీల్ నారంగ్, నారాయణ్ దాస్ నారంగ్ నిర్మాతలు. వరల్డ్ క్లాస్ ఎక్విప్‌మెంట్‌తో, ప్రపంచ స్థాయి హంగులతో ఈ మల్టీప్లెక్స్ ని నిర్మిస్తున్నారట.
ప్రస్తుతం అల్లు అర్జున్ పాల్గొన ఈ పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బన్నీ ఫ్యామిలీ క్రమంగా సినిమాలకు సంబంధించిన హబ్‌గా మారబోతుంది. ఇప్పటికే గీతా ఆర్ట్స్ ద్వారా సినిమాలను నిర్మిస్తున్నారు. మరోవైపు `ఆహా`లో భాగమై తెలుగు ఓటీటీలో టాప్‌లో రన్ అవుతున్నారు. మరోవైపు అల్లు స్టూడియోని నిర్మిస్తున్నారు. భారీ స్థాయిలో ఈ స్టూడియో నిర్మాణం జరుగుతుంది. మరోవైపు ఇప్పుడు మల్టీప్లెక్స్ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఇలా సినిమాకి సంబంధించిన అన్ని విభాగాల్లో ఎంటర్ అవుతూ తామే ఓ సంస్థగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు.
also read: సాయిధరమ్ తేజ్ లుక్.. అసలైన పండుగ అంటూ ఫ్యామిలీ ఫోటో షేర్ చేసిన చిరు.. సాయితేజ్ ఎమోషనల్ పోస్ట్
అల్లు అర్జున్ ప్రస్తుతం `పుష్ప` చిత్రంలో నటిస్తున్నారు. ప్యాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 17న విడుదల కాబోతుంది. ఇది రెండు భాగాలుగా రిలీజ్ కానుంది.
also read: Sai dharam tej: సాయి ధరమ్ తేజ్ లో ఆ మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది!