Allu Arjun: మొన్న బస్ ఎక్కమని...ఇప్పుడు తిండి తినమని .
`పుష్ప`తో పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయిన బన్నీ ఈ యాడ్ కోసం భారీ మొత్తాన్ని డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. అంటే త్వరలో బన్నీ జొమాటో కోసం భారీ స్థాయిలో ప్రచారం చేయనున్నారని అర్దమవుతోంది.
మెగా హీరో అల్లు అర్జున్ ఇప్పటికే అనేక కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే.తాజాగా ఈయన ప్రముఖ ఫుడ్ అగ్రిగేటర్ యాప్, జోమాటో బ్రాండ్ అంబాసిడర్‌గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంతకం చేసారు. హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్‌లో ఈ వాణిజ్య ప్రకటన షూటింగ్ జరుగుతోంది.
అల్లు అర్జున్ తో `వేదం` మూవీ చేసిన క్రిష్ ఈ కమర్షియల్ యాడ్ ని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ యాడ్ లో బన్నీతో కలిసి నేహా శెట్టి నటిస్తోంది. త్వరలోనే ఈ యాడ్ కి సంబంధించిన ప్రకటన విడుదల కానుంది. `పుష్ప`తో పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయిన బన్నీ ఈ యాడ్ కోసం భారీ మొత్తాన్ని డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. అంటే త్వరలో బన్నీ జొమాటో కోసం భారీ స్థాయిలో ప్రచారం చేయనున్నారని అర్దమవుతోంది. ఇందు కోసం భారీగానే ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు.
మరో ప్రక్క బన్నీ నటించిన `పుష్ప` ఈ శుక్రవారం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న తెలిసిందే. అయితే హిందీ వెర్షన్ మాత్రం రిలీజ్ కావడం లేదు. హిందీలో సినిమా భారీ వసూళ్లని రాబడుతున్న నేపథ్యంలోనే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇక `పుష్ప` పార్ట్ 2 త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది.
`పుష్ప`తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే. దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ హల్చల్ చేస్తున్న `పుష్ప` ఇప్పటికే ఉత్తరాదిలో రికార్డు స్థాయిలో వసూళ్లని రాబడుతూ సంచలనం సృష్టిస్తోంది. ఏకంగా ఉత్తరాదిలో 70 కోట్ల మార్కుని చేరి ట్రేడ్ వర్గాలనే ఔరా అనిపిస్తోంది. సుకుమార్ - బన్నీల కలయికలో ముచ్చటగా మూడవ చిత్రంగా రూపొందిన ఈ మూవీ విడుదలైన ఐదు భాషల్లోనూ తన ప్రభంజనాన్ని కొనసాగిస్తూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది.