స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల.. వైకుంఠపురములో అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత బన్నీ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ చిత్రంలో నటించాల్సి ఉంది. కానీ ఆ ప్రాజెక్ట్ ఆలస్యం కానున్నట్లు సమాచారం. 

సుకుమార్ దర్శకత్వంలో నటించేందుకు కూడా బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అల్లు అర్జున్ ఐకాన్ చిత్రం కంటే ముందుగా సుకుమార్ దర్శకత్వంలోని చిత్రాన్ని ప్రారంభించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈచిత్ర లాంచింగ్ కు ముహూర్తం కూడా ఖరారైందట. ఈ దసరాకు చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. 

అల.. వైకుంఠపురంలో చిత్ర షూటింగ్ పూర్తి కాగానే సుకుమార్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ని బన్నీ ప్రారంభించనున్నారు. ఇక ఐకాన్ చిత్రాన్ని వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. సుకుమార్ రంగస్థలం తర్వాత బన్నీతో జత కట్టడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే ఆర్య, ఆర్య 2 చిత్రాలువచ్చాయి.