ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు. నెగిటివ్ టాక్ తో మొదలైన పుష్ప చిత్రం క్రమంగా సూపర్ హిట్ గా మారింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా అదరగొట్టాడు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు. నెగిటివ్ టాక్ తో మొదలైన పుష్ప చిత్రం క్రమంగా సూపర్ హిట్ గా మారింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా అదరగొట్టాడు. ఎర్ర చందనం కూలీగా బన్నీ నటన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. తానేం తక్కువ తినలేదు అన్నట్లుగా హీరోయిన్ గా రష్మిక మందన కూడా మెస్మరైజ్ చేసింది. 

అందాలు ఒలకబోస్తూనే పల్లెటూరి యువతిగా ఆకట్టుకుంది. ఈ జంటకు పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన గుర్తింపు లభించింది. ప్రస్తుతం అల్లు అర్జున్, రష్మిక పుష్ప పార్ట్ 2 పుష్ప ది రూల్ కి రెడీ అవుతున్నారు. అంతకంటే ముందుగా ఓ క్రేజీ షోలో అల్లు అర్జున్, రష్మిక మెరవబోతున్నట్లు తెలుస్తోంది. 

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా 'కాఫీ విత్ కరణ్' షో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ షో 7వ సీజన్ కి రెడీ అవుతోంది. కాకపోతే చిన్న మార్పు. 7 వ సీజన్ ని టివిలో టెలికాస్ట్ చేయడం లేదు. ఓటిటిలో ప్రసారం చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా కరణ్ జోహార్ ప్రకటించారు. 

సెలెబ్రిటీలని సరదాగా ఇంటర్వ్యూ చేసే ఈ టాక్ షో సూపర్ హిట్ అయింది. త్వరలో ప్రారంభం కాబోయే ఈ షోలో అల్లు అర్జున్, రష్మిక జంటగా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుటికే టీమ్ బన్నీ, రష్మికని సంప్రదించారట. వారిద్దరూ చాలా ఎగ్జైట్ అవుతూ అంగీకరించినట్లు తెలుస్తోంది. 

అల్లు అర్జున్ పుష్ప క్రేజ్ ని కరణ్ జోహార్ వాడుకునేందుకు రెడీ అయిపోయారు. ఒకరకంగా అల్లు అర్జున్ కి కూడా ఇది మంచి అవకాశమే. పుష్ప పార్ట్ 2 ముందు హిందీ ఆడియన్స్ కి మరింత చేరువ కావచ్చు.