పుష్ప మొదటి భాగం హిందీలో ఊహించని విధంగా సక్సెస్ అయింది. పుష్ప 2పై నార్త్ లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కలసి చేసిన మ్యాజిక్ కి ఇండియా మొత్తం ఫిదా అయింది.

పుష్ప మొదటి భాగం హిందీలో ఊహించని విధంగా సక్సెస్ అయింది. పుష్ప 2పై నార్త్ లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కలసి చేసిన మ్యాజిక్ కి ఇండియా మొత్తం ఫిదా అయింది. పుష్ప మొదటి భాగం హిట్ కావడంతో పుష్ప 2 కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. కానీ ఇంకా పుష్ప 2 షూటింగ్ ప్రారంభం కాలేదు. 

భారీ బడ్జెట్ లో నిర్మించే సన్నాహకాలు చేస్తుండడంతో ఆలస్యం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి గత రాత్రి సౌత్ ఆఫ్రికా బయలుదేరారు. ఫ్యామిలీతో కలిసి సౌత్ ఆఫ్రికా వెళ్లారు అంటే వెకేషన్ ఎంజాయ్ చేయడానికి అని అనుకుంటారు. 

అయితే బన్నీ సౌత్ ఆఫ్రికా టూర్ పై ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. ఓ వివాహ వేడుకకి హాజరయ్యేందుకు బన్నీ సౌత్ ఆఫ్రికా వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. దీనితో సౌత్ ఆఫ్రికాలో ఎవరి వెడ్డింగ్ అనే చర్చ కూడా మొదలైంది. ఎయిర్ పోర్ట్ లో బన్నీ తన పిల్లలు అర్హ, అయాన్.. సతీమణి అల్లు స్నేహతో కనిపించారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

ఇటీవలే బన్నీ తన తమ్ముడు అల్లు శిరీష్ నటించిన ఊర్వశివో రాక్షసివో చిత్ర సక్సెస్ సెలెబ్రేషన్స్ కి హాజరయ్యారు. ఇక పుష్ప విషయానికి వస్తే.. వీలైనంత త్వరగానే పుష్ప 2 ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ మ్యానరిజమ్స్, డైలాగ్స్ అంతర్జాతీయ స్థాయిలో వైరల్ అయ్యాయి. సో పుష్ప 2 తో బన్నీ ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో వేచి చూడాలి.