టాలీవుడ్ లో కొందరు దర్శకులు హీరోలను దృష్టిలో పెట్టుకొని కథలను సిద్ధం చేస్తుంటారు. తమ కథలతో హీరోలను ఒప్పించి సినిమాలు చేస్తుంటారు. రీసెంట్ గా కొందరు దర్శకుడు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో సినిమా చేయాలని ఆలోచించి కొన్ని లైన్ లను రాసుకున్నారట.

కానీ ఈ హీరోలు దర్శకుల ఐడియాను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ నటించిన 'గీత గోవిందం' అలానే 'టాక్సీవాలా' సినిమాల ప్రమోషన్స్ కోసం అల్లు అర్జున్ స్వయంగా రంగంలోకి దిగారు. ఈవెంట్ లో ఈ ఇద్దరి హీరోలను పక్కపక్కనే చూడడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు.

దీంతో ఈ కాంబినేషన్ లో సినిమా చేయాలని కొందరు రచయితలు, దర్శకులు భావించారు. అయితే ఈ విషయం బన్నీ, విజయ్ దేవరకొండలకు తెలియడంతో ఈ మల్టీస్టారర్ ఐడియాని రిజక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

కథలు నచ్చక అంగీకరించలేదో, లేక, ఈ సమయంలో మల్టీస్టారర్ వద్దని అనుకున్నారో కానీ తమ కాంబోలో సినిమా వద్దని చెప్పేశారట. ప్రస్తుతం అల్లు అర్జున్ తన తదుపరి సినిమాను అనౌన్స్ చేయనున్నాడు. మరోపక్క విజయ్ 'డియర్ కామ్రేడ్' సినిమాలో నటిస్తున్నాడు.