అల్లు అర్జున్ కు గత కొంతకాలంగా తమిళ మార్కెట్లోకి అడుగు పెట్టాలని ఉంది. అయితే అది తన సినిమాలు డబ్ చేసి ఏదో మమ అనిపించుకోవాలని లేదు. తమిళంలోకి వెళ్తే సాలిడ్ గా హిట్ కొట్టాలి..అంటే ముందు మంచి ఓపినింగ్స్ తెచ్చుకోవాలి. ఈ విషయంలో అల్లు అర్జున్ పూర్తి క్లారిటీగా ఉన్నాడు. మళయాళంలో మాదిరిగానే తమిళంలోనూ తన సత్తా చూపించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. 

అందులో భాగంగానే ఆ మధ్యన ప్రముఖ తమిళ దర్శకుడు లింగు స్వామితో సినిమా చేద్దామని పిక్స్ అయ్యాడు. చాలా కాలం చర్చలు సైతం జరిగాయి. అయితే లింగు స్వామి కథ రెండు భాషలకు తగినట్లు లేదని రిజెక్ట్ చేసాడు. ఆ కథ తమిళం వాళ్లకు నచ్చచ్చు కానీ తెలుగు,మళయాళంలో వర్కవుట్ కాదని నో చెప్పేసాడు. దాంతో తెలుగులో వరస ప్రాజెక్టులలో బిజీ అయ్యాడు. కానీ ఆయన దృష్టి మొత్తం తమిళం మీదే కాన్సర్టేట్ అయ్యి ఉంది. ఒక్కసారి తమిళంలో సాలిడ్ ఎంట్రీ ఇస్తే..ఇంక వరసగా తన సినిమాలు అన్ని అక్కడ కూడా రిలీజ్ చేయచ్చనేది అతని ప్లాన్. 

దాంతో ఇఫ్పుడు మరోసారి తమిళ దర్శకుడు మురగదాస్ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. రీసెంట్ గా మురగదాస్ వచ్చి అల్లు అర్జున్ కు స్టోరీ లైన్ చెప్పినట్లు తెలుస్తోంది. తమిళ, తెలుగు  భాషలకు వర్కవుట్ అయ్యే యాక్షన్ స్టోరీ లైన్ అని వెంటనే ఓకే చేసి పూర్తి స్క్రిప్టు రెడీ చేయమని చెప్పినట్లు సమాచారం. 

గతంలో మహేష్ తో చేసిన స్పైడర్ తరహాలో సింగిల్ లైన్ పై వెళ్లకుండా ఓ కమర్షియల్ స్క్రిప్టుతో తమిళంలోకి వెళ్లబోతున్నట్లు సమాచారం. మురగదాస్ కు తమిళంలో,హిందిలో,తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. దాంతో అతనితో సినిమా చేస్తే తమిళంలో మంచి ఓపినింగ్స్ ఖాయం అని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం మురగదాస్ ..రజనీకాంత్ తో దర్బార్ చిత్రం చేస్తున్నాడు.