వెకేషన్ నుంచి తిరిగొచ్చిన అల్లు అర్జున్ దంపతులు.. జీన్స్ లో స్టైలిష్ గా అల్లు స్నేహ
అల్లు అర్జున్ షూటింగ్ నంచి చిన్న బ్రేక్ తీసుకుని భార్యలతో కలసి యూరప్ టూర్ వెళ్ళాడు. వెకేషన్ ముగించుకుని బన్నీ, అల్లు స్నేహ రెడ్డి నేడు ముంబయి లో ల్యాండ్ అయ్యారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 ది రూల్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8న రిలీజ్ చేసిన పుష్ప ది రూల్ టీజర్ ఒక్కసారిగా అంచనాలు రెట్టింపు చేసింది. సినిమాపై ప్రారంభంలోనే సాలిడ్ బజ్ క్రియేట్ చేయడంలో సుకుమార్ సక్సెస్ అయ్యారు. పుష్ప మొదటి భాగం పాన్ ఇండియా హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
ఇటీవల అల్లు అర్జున్ షూటింగ్ నంచి చిన్న బ్రేక్ తీసుకుని భార్యలతో కలసి యూరప్ టూర్ వెళ్ళాడు. వెకేషన్ ముగించుకుని బన్నీ, అల్లు స్నేహ రెడ్డి నేడు ముంబయి లో ల్యాండ్ అయ్యారు.
వీరిద్దరూ ఎయిర్ పోర్ట్ లో వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్, స్నేహ ఇద్దరూ సూపర్ స్టైలిష్ లుక్ లో మెరిసిపోతున్నారు. అల్లు అర్జున్ తన ట్రేడ్ మార్క్ హెయిర్ స్టైల్, బియర్డ్ తో కనిపిస్తుండగా.. అల్లు స్నేహ జీన్స్ ధరించి కనిపిస్తోంది.
ఇద్దరూ చేతిలో చేయి పట్టుకుని నడచి వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు స్నేహ తరచుగా స్టైలిష్ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. బన్నీ తరహాలో ఆమె కూడా సోషల్ మీడియాలో స్టైల్ ఐకాన్ గా మారుతోంది.
ఇదిలా ఉండగా అల్లు అర్జున్ ఇక నుంచి నాన్ స్టాప్ గా పుష్ప 2 షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ వీలైనంత త్వరగా పుష్ప 2 షూట్ ఫినిష్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. పుష్ప 2 చిత్రాన్ని సుకుమార్ కనీవినీ ఎరుగని విధంగా భారీ బడ్జెట్ లో అంతకి మించిన కథతో తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది.