Asianet News TeluguAsianet News Telugu

ఫ్యాన్స్ పై మళ్లీ బన్నీ అసహనం.. ఈ సారి సీరియస్ వార్నింగ్

  • అల్లు శిరీష్ ఒక్ష క్షణం ఆడియో వేడుకకు చీఫ్ గెస్ట్ గా హాజరైన బన్నీ
  • తాజాగా ఫ్యాన్స్ పై మరోసారి అసహనం వ్యక్తం చేసిన బన్నీ
  • బన్నీ అభిమానులు వద్దనుకుంటున్నాడా.. లేక మరేమైనా వుందా..
ALLU ARJUN AGAIN FIRE ON FANS

అల్లు శిరీష్‌, సుర‌భి, సీర‌త్ క‌పూర్, అవ‌స‌రాల శ్రీనివాస్‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన  చిత్రం `ఒక్కక్ష‌ణం`. ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. డిసెంబర్ 29న రిలీజ్ కానున్న ఈ మూవీకి వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సోమవారం సాయంత్రం జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు బన్నీ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. సాధారణంగా బన్నీకి ఫ్యాన్స్ అల్లరి చేస్తే అసహనం. తాజాగా ఈ ఒక్క క్షణం ప్రి రిలీజ్ ఈవెంట్ లోనూ మరోసారి తనకు ఫ్యాన్స్ పై అసహనం పెరిగిపోయింది.

 

సాధారణంగానే మెగా ఫ్యామిలీ హీరోల సినిమా ఫంక్షన్లు అంటేనే అభిమానుల గోల, ఈల, కేరింతలు, అరుపులు. వారి మూలంగా వేదిక మీద మాట్లాడేవారు ఇబ్బంది పడటం లాంటివి గతంలో చూశాం. ఓ సారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గోల చేస్తుంటే బన్నీ గట్టి వార్నింగే ఇచ్చాడు. అప్పట్లో ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా మరోసారి బన్నీకి అలాంటి సందర్భమే ఎదురైంది. ఈ నేపథ్యంలో బన్నీ మరోసారి సహనం కోల్పోయారు.

 

ఈ సందర్భంగా బన్నీ అభిమానుల తీరుతో విసిగిపోయారు. తాను మాట్లాడుతుంటే అభిమానులు గోల చేయడంతో బన్నీ సహనం కోల్పోయారు. "ఫ్యాన్స్ అందరికీ ఒకటే రిక్వెస్ట్... ఎవరైనా మాట్లాడేపుడు ఎదురు మాట్లాడటం సంస్కారం కాదు. ఫంక్షన్ పెట్టిందే సరదాగా అరవడానికి... కానీ మనిషి మాట్లాడేపుడు కాదు. అది బేసిక్ రెస్పెక్ట్." అంటూ బన్నీ ఫైర్ అయ్యారు.

 

"సినిమా వేడుకల్లో అయినా సరే, మరెక్కడ అయినా సరే.... ఒకరి ఫీలింగ్ చెప్పుకునేపుడు అడ్డు పడకూడదు. ఎవరి విషయంలో అయినా అంతే. మాట్లాడేపుడు ఎవరైనా అడ్డం వస్తే వారి పేరు ఎత్తిమరీ చెబుతా. ప్లీజ్ డోంట్ డ్రిస్ట్రబ్ మి. ఆ విషయంలో నేను ట్రిప్ అవుతా, గతంలో జరిగిన ఇష్యూల గురించి మీకు అందరికీ తెలుసు." అంటూ బన్నీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

తన ప్రసంగం ముగిసిన తర్వాత బన్నీ కాస్త కూల్ అయ్యారు. అభిమానులు కూడా కూల్ చేసే ప్రయత్నం చేశారు. ఇపుడు అరిస్తే బావుంటుంది అంటూ వారిని ప్రోత్సహించారు. తాను ఎందుకు అలా అనాల్సివచ్చిందో వివరించారు. నేను మాట్లాడుతుంటే మీరు అరిచినందుకు నేను కాస్త హర్ట్ అయ్యాను. కొంచెం కోప్పడ్డాను. ఇదేమీ మీరు మనసులో పెట్టుకోవద్దు అని అల్లు అర్జున్ అభిమానులకు సూచించారు. వెంటనే మైక్ అందుకున్న శిరీష్ నువ్వు ఇంకా నా పేరు సూర్య సినిమా క్యారెక్టర్లో ఉన్నావు కాబట్టే అలా బిహేవ్ చేశావు. అది అర్జున్ కాదు, సూర్య అంటూ చమత్కరించారు.

 

అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ఇది నేను ఎప్పటి నుండో చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. నేను చెప్పేది ఒకటే. ఎప్పుడూ గుర్తుంచుకోండి. పబ్లిక్ ఫంక్షన్లు పెట్టేదే ఈ సరదా కోసం. కానీ ఎవరైనా మాట్లాడటం మొదలు పెట్టిన తర్వాత, వారి ఫీలింగ్స్ చెప్పుకుటుంటే అరవడం, వారికి అడ్డు పడటం సంస్కారం కాదు. ఇప్పుడు అలాంటి సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను అని బన్నీ తెలిపారు.

 

‘‘సినిమా ఫంక్షన్లలో ఒకరు మాట్లాడుతుంటే అరవకండి. అది ఎవరి ఫ్యాన్స్ అయినా సరే. నా ఫ్యాన్స్ వల్ల అలా జరిగింది అని తెలిసినా నేను అసహస్యంగా ఫీలవుతాను. అదీ నేను చెప్పాలనుకున్నది. థాంక్సూ.'' అంటూ ముగించాడు బన్నీ.

Follow Us:
Download App:
  • android
  • ios