మెగాస్టార్ ప్రతిష్టాత్మక చిత్రం సైరా సినిమాపై ప్రస్తుతం అంచనాల డోస్ మరింత పెరుగుతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించిన చిత్ర యూనిట్ సినీ ప్రముఖులను వేదికపైకి ఆహ్వానించింది. అయితే వేడుకలో దాదాపు మెగా హీరోలందరూ కనిపించగా అల్లు హీరోలు మాత్రం హాజరుకాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. 

మెయిన్ గా అల్లు అర్జున్ ఈవెంట్ కి రాకపోవడం సరికొత్త అనుమానాలకు దారి తీస్తోంది. కనీసం సోషల్ మీడియాలో కూడా బన్నీ ఈవెంట్  పై ఎలాంటి స్పందన ఇవ్వలేదు. సైరా ప్రమోషన్స్ లో మెగా హీరోలందరూ మెగాస్టార్ పోటోలను టీజర్స్ ట్రైలర్స్ ని షేర్ చేసుకుంటూ ఉంటే బన్నీ మాత్రం పెద్దగా స్పందించకపోవడం గమనార్హం. 

ఒకవేళ షూటింగ్ లో బిజీగా ఉండి అందుబాటులో లేకపోయినా సోషల్ మీడియా ద్వారా అయినా ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చినా సరిపోయేది. కానీ బన్నీ అందుబాటులో ఉన్నా కూడా సైరా ఈవెంట్ కి రాలేదు అనే గాసిప్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరి ఆ అనుమానల డోస్ ఎంతవరకు పెరుగుతుందో చూడాలి.