చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగు పెట్టడం, సింహం మీద కూర్చుని ఠీవీగా రావడం అభిమానులకు బాగా నచ్చేసింది. 


డైరెక్ట‌ర్ గుణ శేఖ‌ర్ రూపొందించిన లేటెస్ట్ చిత్రం శాకుంత‌లం. పౌరాణిక ప్రేమ గాథ‌. ఈ సినిమాలో దుష్యంతుడు, శ‌కుంత‌ల కుమారుడు భ‌ర‌తుడి చిన్ననాటి పాత్ర‌లో అర్హ న‌టించిన సంగతి తెలిసిందే. శుక్ర‌వారం శాకుంత‌లం సినిమా రిలీజైంది. అందులో భ‌ర‌తుడిగా న‌టించిన అర్హ న‌ట‌న‌ను అంద‌రూ అప్రిషియేట్ చేస్తున్నారు. అయితే సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే సినిమాకు కాస్తంత ఊపు ఇవ్వటానికి బన్ని అభిమానులను థియేటర్స్ కు రప్పించటానికా అన్నట్లు అల్లు అర్హ పై టీజర్ కట్ చేసి వదిలారు. అయితే ఏ మాటకా మాట...అల్లు అర్హ మాత్రం చాలా క్యూట్ గా ఉంది. చక్కగా డైలాగులు ఎక్కడా తడబాటు లేకుండా చెప్తోంది. నటన తన రక్తంలో ఉందని నిరూపిస్తోంది. ఆ టీజర్ మీరూ చూడండి.

YouTube video player


 ఈ నేప‌థ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శాకుంత‌లం టీమ్‌కు విషెష్ చెబుతూ, త‌న కుమార్తె అర్హ ఎంట్రీ గురించి స్పందించారు. ‘‘శాకుంత‌లం టీమ్‌కు అభినంద‌న‌లు. ఇలాంటి గొప్ప చిత్రాన్ని రూపొందించిన గుణ శేఖ‌ర్‌గారు, నీలిమ గుణ‌గారు, శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌కి శుభాకాంక్ష‌లు. స్వీటెస్ట్ లేడీ స‌మంత, మ‌ల్లు బ్ర‌ద‌ర్ దేవ్ మోహ‌న్‌కి కంగ్రాట్స్‌. మీ అంద‌రికీ చిన్న అతిథి పాత్ర చేసిన అల్లు అర్హ న‌చ్చే ఉంటుంది. త‌నను ఎంతో బాగా చూసుకుని వెండితెర‌కు ప‌రిచయం చేసి గుణ‌గారికి ధ‌న్య‌వాదాలు. ఈ క్ష‌ణాల‌ను ఎప్ప‌టికీ గుర్తుంచుకుంటాం’’ అన్నారు. 

వాస్తవానికి ‘శాకుంతలం’ ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి అర్హ పాత్రపై సినీ అభిమానులలో బాగా ఆసక్తి నెలకొంది. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగు పెట్టడం, సింహం మీద కూర్చుని ఠీవీగా రావడం అభిమానులకు బాగా నచ్చేసింది. సినిమా ప్రమోషన్స్ లో సైతం సమంత అర్హ నటన గురించి గొప్పగా చెప్పడంతో అందరికీ ఆమె పాత్రపై మరింత క్యూరియాసిటీ పెరిగింది. తొలి షో చూసిన ప్రేక్షకులు అర్హ నటనకు ఆశ్చర్యపోయారు. సినిమా చివరి 15 నిమిషాల్లో తన చక్కటి నటనతో ఆకట్టుకుంది. అచ్చం తండ్రి మాదిరిగానే అద్భుతంగా నటించిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అల్లు ఫ్యామిలీ నట వారసత్వాన్ని అర్హ ముందుకు తీసుకెళ్తుందనడంలో ఎలాంటి అనుమానం అవసరం లేదంటున్నారు.

శాకుంత‌లం సినిమాలో టైటిల్ పాత్ర‌లో స‌మంత క‌నిపించింది. కాళిదాసు రాసిన దుష్యంతుడు, శ‌కుంత‌ల ప్రేమ‌క‌థ ఆధారంగా ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఈ సినిమాలో దుష్యంతుడిగా మ‌ల‌యాళ న‌టుడు దేవ్‌మోహ‌న్ క‌నిపించారు శాకుంత‌లం సినిమాను గుణ‌శేఖ‌ర్ త‌న‌య నీలిమ గుణ‌తో క‌లిసి దిల్‌రాజు నిర్మించారు.