Asianet News TeluguAsianet News Telugu

‘పుష్ప’ టీమ్ కు అల్లు అరవింద్ సీరియస్ వార్నింగ్ ?

మొదట ఈ సినిమా షూట్ ని రాజమండ్రి దగ్గరలో ఉంటూ మారేడుమిల్లి అడవుల్లో జరపాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతం ఎక్కడా పరిస్దితులు చక్కబడలేదని అల్లు అరవింద్ నో చెప్పి...సెట్ లో అయితే షూటింగ్ ,పరిశరాలు మన చేతిలో ఉంటాయని చెప్పారట. దానికి తోడు భారీగా కురిసిన వర్షాలకు అంతటా సిట్యువేషన్ మారిపోయింది.

Allu Aravind warning to Pushpa team jsp
Author
Hyderabad, First Published Oct 23, 2020, 3:27 PM IST

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. కరోనా కారణంగా ఈ చిత్ర షూటింగ్‌ వాయిదా పడింది.  ఎప్పుడు షూటింగ్ ప్రారంభం అవుతుందా అని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ సినిమా షూట్ గురించిన ఓ వార్త బయిటకు వచ్చింది. అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు ఈ సినిమా హైదరాబాద్ లో వేసిన ఓ సెట్ లో నవంబర్ 2 నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. మొదట ఈ సినిమా షూట్ ని రాజమండ్రి దగ్గరలో ఉంటూ మారేడుమిల్లి అడవుల్లో జరపాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతం ఎక్కడా పరిస్దితులు చక్కబడలేదని అల్లు అరవింద్ నో చెప్పి...సెట్ లో అయితే షూటింగ్ ,పరిశరాలు మన చేతిలో ఉంటాయని చెప్పారట. దానికి తోడు భారీగా కురిసిన వర్షాలకు అంతటా సిట్యువేషన్ మారిపోయింది.

 ఓ ప్రక్కన కరోనా, మరో ప్రక్క అడవి అంటే పురుగూ పుట్ర నుంచి తప్పించుకుంటూ షూట్ చేయాలి. వీటిన్నటినీ దృష్టిలో పెట్టుకుని మొదట కొన్ని సీన్స్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఓ సెట్ లో తీసుకోమని అరవింద్ సూచించారని తెలుస్తోంది. అయితే అల్లు అర్జున్,బన్ని ఆయన్ని కన్వీన్స్ చేయబోతే వద్దని హెచ్చరికగా కాస్త గట్టిగానే చెప్పారని అంటున్నారు.   మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత స్వరాలు అందిస్తున్నాడు. హాలీవుడ్‌కి చెందిన మిరోస్లా కుబా బ్రోజెక్‌ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రష్మిక హీరోయిన్.

ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఈ చిత్రం రాబోతోంది. విజయ్‌సేతుపతి, మాధవన్ సహా అనేక మంది తమిళ నటులు నటిస్తారని వార్తలు వచ్చినా చిత్ర బృందం అధికారికంగా ఎవరి పేరునూ వెల్లడించలేదు. తాజాగా మరో తమిళ నటుడి పేరు సైతం వెలుగులోకి వచ్చింది. విలక్షణ దర్శకుడు, నటుడు అయినా సముద్రఖని ఈ చిత్రంలో నటిస్తారని టాలీవుడ్‌ వర్గాల సమాచారం. అయితే పుష్ప బృందం అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఇప్పటికే సముద్రఖని, అల్లుఅర్జున్ కలిసి ‘అల వైకుంఠపురం’లో పనిచేశారు. ఈ చిత్రం అనంతరం తెలుగులో ఆయనకు అవకాశాలు వరుస కట్టాయి. దీంతో విభిన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ ఆచితూచి అడుగేస్తున్నారు.

 ప్రస్తుతం ఆయన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘క్రాక్’‌, ‘ఆకాశవాణి’ తదితర చిత్రాల్లో నటిస్తున్నారు. గతంలో ‘శంభో శివ శంభో’, ‘జెండాపై కపిరాజు’ సహా అనేక తమిళ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ‘రఘువరన్‌ బీటెక్’‌లో ధనుష్కు తండ్రి పాత్రలో, ‘అలవైకుంఠపురం’లో అప్పలనాయుడి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన ముద్ర వేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios