వరుస విజయాలతో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. టాలీవుడ్ లో క్రమంగా వరుణ్ తేజ్ మార్కెట్ పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది వరుణ్ తేజ్ నటించిన ఎఫ్2, గద్దలకొండ గణేష్ చిత్రాలతో వరుణ్ సూపర్ హిట్స్ సొంతం చేసుకున్నాడు. 

గద్దలకొండ గణేష్ చిత్రంలో వరుణ్ నటనకు ప్రశంసలు దక్కాయి. వరుణ్ తేజ్ కమర్షియల్ చిత్రాలు చేస్తూనే కంచె, అంతరిక్షం లాంటి విభిన్నమైన చిత్రాలకు కూడా సై అంటున్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ తదుపరి చిత్రం బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కనుంది. 

డెబ్యూ దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. భారీ బడ్జెట్ లో రూపొందబోయే ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ నిర్మిస్తుండడం విశేషం. ఈ చిత్రం తర్వాత వరుణ్ తేజ్ మరో మూవీ కూడా అల్లు ఫ్యామిలీ నిర్మాణంలోనే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

రచయితగా టెంపర్, కిక్, రేసుగుర్రం లాంటి సూపర్ హిట్ చిత్రాలకు కథలు అందించిన వక్కంతం వంశీ.. నా పేరు సూర్య చిత్రంతో దర్శకుడిగా మారారు. అల్లు అర్జున్ హీరోగా నటించిన నాపేరు సూర్య చిత్రం నిరాశపరిచింది. దీనితో మరోసారి తాను దర్శకుడిగా నిరూపించుకునేందుకు వంశీ ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో వక్కంతం వంశీ కొత్త చిత్రానికి అల్లు అరవింద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

వక్కంతం వంశీ తన తదుపరి చిత్రాన్ని ఓ యువ హీరోతో తెరకెక్కించబోతున్నారు. ఆ యువ హీరో ఎవరూ కాదు.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. వక్కంతం వంశీ దర్శత్వంలో, అల్లు అరవింద్ నిర్మాతగా.. వరుణ్ తేజ్ హీరోగా ఆసక్తికర కాంబినేషన్ కు రంగం సిద్ధం అయినట్లు టాలీవుడ్ లో వినికిడి. 

రాంచరణ్ ప్లాన్ కు హీరోలంతా ఒప్పుకుంటారా!

మంచి కథలు ఎంచుకుని హీరోల క్రేజ్ ఉపయోగించుకోవడంలో అల్లు అరవింద్ సిద్ధహస్తుడు. అల్లు అరవింద్, చిరంజీవి కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. చిరు తర్వాత అరవింద్ పవన్ కళ్యాణ్ హీరోగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, జానీ, జల్సా లాంటి చిత్రాలని నిర్మించారు. 

ఇస్మార్ట్ ఎఫెక్ట్.. మహేష్ డైరెక్టర్ తో రామ్ సినిమా!

ఆ తర్వాత రాంచరణ్ తో మగధీర, ధృవ చిత్రాలని అల్లు అరవింద్ నిర్మించారు. ప్రస్తుతం అల్లు ఫ్యామిలీ దృష్టి వరుణ్ పై పడ్డట్లు ఉంది. తొలి చిత్రం నుంచే నటనలో  పరిణితి కనబరుస్తున్న వరుణ్ తేజ్ క్రేజ్ రోజు రోజుకు పెరుగుతోంది. మంచి స్క్రిప్ట్, మీడియం బడ్జెట్ లో వరుణ్ తో సినిమా నిర్మిస్తే లాభాల పంట పడించడం ఖాయం. బహుశా అల్లు అరవింద్ ప్లాన్ అదేనేమో. ఈ క్రేజీ కాంబినేషన్ పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.