పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ నామస్మరణతో సోషల్ మీడియా మోతెక్కుతోంది. పవన్ కళ్యాణ్.. బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షోకి హాజరవుతున్న సంగతి తెలిసిందే.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ నామస్మరణతో సోషల్ మీడియా మోతెక్కుతోంది. పవన్ కళ్యాణ్.. బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షోకి హాజరవుతున్న సంగతి తెలిసిందే. అన్ స్టాపబుల్ షో సీజన్ 2 చాలా క్రేజీగా కొనసాగుతోంది. బడా హీరోలు, రాజకీయ నేతలు ఈ షోకి హాజరవుతున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ సీజన్ చివరి ఎపిసోడ్ చాలా గ్రాండ్ లెవల్ లో ముగియబోతోంది. పవన్ కళ్యాణ్ పాల్గొనే ఎపిసోడే చివరిది అట. బాలయ్య, పవన్ కళ్యాణ్ కలసి తొలిసారి కెమెరాని పేస్ చేసే క్షణం వచ్చేసింది. నేడు అన్నపూర్ణ స్టూడియోస్ లో అన్ స్టాపబుల్ షో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ షూటింగ్ మొదలైంది. 

ఈ ఎపిసోడ్ పై అటు సినీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా ఉత్కంఠ నెలకొని ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద అభిమానులు భారీ సంఖ్యలో చేరారు. పవన్ కి బాలయ్య స్వాగతం పలకడం, ఆలింగనం చేసుకోవడం లాంటి దృశ్యాలు అప్పుడే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

ఇక అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతూ అన్ స్టాపబుల్ షో సీజన్ 2 చాలా భారీగా జరుగుతోంది. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ రావడంతో బిగ్గెస్ట్ అండ్ క్రేజీయెస్ట్ గా మారింది. థాంక్యూ పవన్ అంటూ అల్లు అరవింద్ కామెంట్స్ చేశారు. 

ఈ షోలో పవన్ కళ్యాణ్ ని బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నారో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. పవన్, బాలయ్య ఇద్దరూ పాలిటిక్స్ లో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన పొత్తు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలయ్య రాజకీయాలు ఏమైనా పవన్ తో మాట్లాడతారా అనే ఆసక్తి కూడా ఉంది. ఈ ఉత్కంఠ కి త్వరలోనే తెరపడనుంది.