పవన్‌ కళ్యాణ్‌ నటించిన `హరి హర వీరమల్లు` సినిమా ఎట్టకేలకు విడుదల కాబోతుంది. అయితే ఈ చిత్రానికి పోటీగా ఓ డబ్బింగ్‌ సినిమాని దించుతున్నారు అల్లు అరవింద్‌. 

పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్‌ హీరోగా రూపొందిన `హరి హర వీరమల్లు` మూవీ త్వరలో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. 

అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు ఇప్పుడు విడుదల కాబోతుంది. జులై 24న ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. 

దీంతో ప్రమోషన్స్ కూడా షురూ చేసింది టీమ్‌. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ సినిమాపై బజ్‌ క్రియేట్‌ చేసింది. సినిమాపై అంచనాలను పెంచేసింది. 

`హరి హర వీరమల్లు`కి పోటీగా డబ్బింగ్‌ చిత్రం 

నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్‌ నెగటివ్ రోల్‌ చేస్తున్నారు. ఔరంగజేబ్‌ నాటి చరిత్ర ఆధారంగా చేసుకుని ఈ మూవీ తెరకెక్కుతుందని, ఇందులో బందిపోటు వీరమల్లుగా పవన్ కళ్యాణ్‌ కనిపిస్తారని అంటున్నారు. 

కొహినూర్‌ వజ్రాన్ని తిరిగి ఇండియా తీసుకురావడమే లక్ష్యంగా ఆయన పని చేయబోతున్నట్టు ట్రైలర్‌ చూస్తుంటే తెలుస్తోంది. 

అయితే విష్ణువు, శివుడు కలిపిన అవతారం వీరమల్లు అని టీమ్‌ చెబుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిత్రానికి పోటీగా మరో చిత్రాన్ని దించుతున్నారు నిర్మాత అల్లు అరవింద్‌. అయితే అది డబ్బింగ్‌ మూవీ కావడం గమనార్హం.

`మహావతార్‌ నరసింహ` మూవీ తెలుగులో గీతా డిస్ట్రిబ్యూషన్‌ రిలీజ్‌

కన్నడలో బిగ్‌ ప్రొడక్షన్‌ హౌజ్‌ హోంబలే నిర్మించిన `మహావతార్‌ నరసింహ` చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. దీన్ని అల్లు అరవింద్‌కి చెందిన గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్‌తో తెలుగులో విడుదల చేస్తుండటం విశేషం. 

అయితే ఈ మూవీని తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 25నే రిలీజ్‌ చేస్తుండటం విశేషం. దీంతో ఈ మూవీ పవన్‌ కళ్యాణ్‌ `హరి హర వీరమల్లు`కి పోటీగా రాబోతుండటం గమనార్హం. 

దీన్ని త్రీడీ వెర్షన్‌లో ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. కన్నడతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో దీన్ని రిలీజ్‌ చేస్తున్నారు.

విష్ణువు దశావతారాల్లో ఒక అవతారమే `మహావతార్‌ నరసింహ`

అయితే `మహావతార్‌ నరసింహ` మూవీ యానిమేషన్‌ ప్రధానంగా తెరకెక్కిన చిత్రం. విష్ణువు దశావతారాల్లో ఒకటైన నరసింహ అవతారం, ఆయన పురాణ కథని బేస్ట్ చేసుకుని ఈ యానిమేషన్‌ మూవీని రూపొందించారు.

 తెలుగులో గీతా డిస్ట్రిబ్యూషన్‌ విడుదల చేస్తున్న తాజాగా ప్రకటించారు.  టీమ్‌ ఈ విషయాన్ని చెబుతూ, `మహావతార్ నరసింహ` విజువల్ వండర్, శక్తివంతమైన కథనంతో ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతోంది. 

ఈ యానిమేటెడ్ ఫ్రాంచైజీ విష్ణువు దశ అవతారాల పురాణ గాథకు జీవం పోస్తుంది. ఇది అత్యాధునిక యానిమేషన్, భారతీయ పురాణాల బేస్డ్ కంటెంట్‌లో ఇంతకు ముందు ఎన్నడూ ప్రయత్నించని సినిమాటిక్ స్కేల్ తో అలరించబోతోంది.

మహావతార్‌ ఫ్రాంఛైజీ నుంచి ఏడు సినిమాలు

ఇప్పటికే విడుదలైన `మహావతార్ నరసింహ` ట్రైలర్ ఆకట్టుకుంది. దీనికి మంచి స్పందన లభించింది. సినిమాకి కూడా మంచి రెస్పాన్స్ వస్తోందని ఆశిస్తున్నట్టు టీమ్‌ తెలిపింది.

 ఈ మూవీకి అశ్విన్‌ కుమార్‌ దర్శకత్వం వహించా, క్లీమ్‌ ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధావన్‌, కుశాల్‌ దేశాయ్‌, చైతన్య దేశాయ్‌ నిర్మిస్తున్నారు. 

ఈ యానిమేటెడ్ ఫ్రాంచైజీ ఒక దశాబ్ద కాలం పాటు కొనసాగుతుంది. విష్ణువు దశ అవతారాలను తెరపైకి ఆవిష్కరిస్తుంది. 

`మహావతార్ నరసింహ` (2025), `మహావతార్ పరశురామ్` (2027), `మహావతార్ రఘునందన్` (2029), `మహావతార్ ధావకధేష్` (2031), `మహావతార్ గోకులానంద`(2033), `మహావతార్ కల్కి పార్ట్ 1` (2035), `మహావతార్ కల్కి పార్ట్ 2` (2037) రాబోతున్నాయి.