Asianet News TeluguAsianet News Telugu

బీర్లు తాగి పడుకునే వారికి అల్లు అరవింద్‌ హెచ్చరిక.. ఇంట్లో ఏం చేస్తర్రా బై, ఓట్‌ వేయండి.. విజయ్‌ కామెంట్స్

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. సెలబ్రిటీలు భారీగా ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్‌, విజయ్‌ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

allu aravind and vijay deverakonda warns to those who not casting vote arj
Author
First Published Nov 30, 2023, 3:12 PM IST

తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. సెలబ్రిటీలు చాలా మంది ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రవితేజ, విజయ్‌ దేవరకొండ, రామ్‌, రానా, నాగచైతన్య, కళ్యాణ్‌ రామ్‌, శేఖర్‌ కమ్ముల, బండ్ల గణేష్‌, అల్లు అరవింద్‌, విశ్వక్‌ సేన్‌ ఇలా చాలా మంది సెలబ్రిటీలు ఓటుని హక్కుని వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లోని వారు నివసించే ప్రాంతాల్లో తమ ఓటుని వేశారు. 

ఓటు వేసిన అనంతరం మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓటు వేయని వారిని హెచ్చరించారు. ఓటు హక్కు వేయకపోతే ప్రశ్నించే హక్కు లేదన్నారు. `ఏం ఓటేస్తామని ఇంట్లో కూర్చుంటారు చూడండి వారికి ఒక్కటే చెబుతున్నా. ఓటు వేయడం మానోద్దు. తర్వాత ప్రభుత్వం అది చేయలేదు, ఇది చేయలేదు అని మాట్లాడే హక్కు ఉండదు. మనసులో కూడా ఉంచుకోకూడదు. అలాంటిది ఏదైనా ఉందంటే ఇంట్లో నుంచి లేచి వచ్చి ఓటు వేయండి. ఈ రోజు హాలీడే లే అని బీర్‌ తాగి పడుకునే వారు చాలా మంది ఉన్నారు. వారికే చెబుతున్నా ఓటు వేయండి` అని తెలిపారు అల్లు అరవింద్‌. 

ఇక విజయ్‌ దేవరకొండ సైతం ఓట్‌ వేసిన అనంతరం ఆయన మీడియాతో ముచ్చటించారు. మన హైదరాబాద్‌, మన రాష్ట్రం ఇంత అభివృద్ధి సాధించిందంటే,ఇప్పుడు ఇంత కనిపిస్తుందంటే అది రాజకీయాల వల్లే, రాజకీయ నాయకుల వల్లే సాధ్యం. మనం గతంలో ఓటు వేశాం కాబట్టి, ఇంత అభివృద్ది చెందింది. మన జీవితాలు ఇంత ఎఫెక్ట్ అయ్యాయి. మనకు ఇలాంటి అభివృద్ధి కావాలంటే, మనం ఇంకా బెటర్‌గా జీవించాలంటే, మన జాబ్స్ బాగుందంటే, మన లైఫ్‌ బాగుండాలంటే ఇంట్లో కూర్చోకుండా ఓటు వేయాలి. ఎవరికీ వేస్తారనేది మీ ఇష్టం. కానీ వచ్చి ఓటు వేయండి` అని చెప్పారు విజయ్‌. ఇక యూత్‌ రావడం లేదు అనేదానికి ఆయన స్పందిస్తూ, వచ్చి వేయండి, ఏం చేస్తారు మీరు, వచ్చి ఓటు వేయాలని విజయ్‌ వెల్లడించారు.

ఈ సందర్భంగా బ్రహ్మానందానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతుంది. ఇందులో ఓటు వేయని వారి గురించి ఏం చెబుతారని అడగ్గా, ఏం చెబుతాం.. ఓటు హక్కుని వినియోగించుకోని వారు అంటాం అంటూ ఫన్నీగా రియాక్ట్ అయ్యాడు. అయితే అది లేటెస్ట్ వీడియోనా, లేక పాతదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అది వైరల్‌ అవుతుంది. హీరో రామ్‌ స్పందిస్తూ, భవిష్యత్‌ బాగుండాలని కోరుకుంటున్నామని, ఓటుని హక్కుని వినియోగించుకోవాలన్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios