ఈ వార్త అంతటా వైరల్ గా మారుతోంది. అయితే సరదాగా తమ కష్టమర్స్ ని అరవింద్  ఏప్రియల్ ఫూల్ ని చేసారా.. అనేది మాత్రం తెలియటం లేదు.  

అల్లు అరవింద్ కు మించిన మార్కెటింగ్ స్ట్రాటజీ నిపుణుడు తెలుగు సినిమా పరిశ్రమలో లేరంటారు. టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్ గా దూసుకుపోతున్న అల్లు అరవింద్, ఓటీటీ రంగం లోకి కూడా అడుగుపెట్టి, ఆహా యాప్ ద్వారా డిజిటల్ మీడియా ప్రపంచం లో సరికొత్త ప్రభంజనం సృష్టించారు.ప్రస్తుతం ‘ఆహా మీడియా’ యాప్ కి యూత్ ఎలా కనెక్ట్ అయ్యారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఒరిజినల్ కంటెంట్ తో పాటుగా, సరికొత్త సినిమాలు, గేమ్ షోస్ మరియు టాక్ షోస్ తో అనతి కాలం లోనే ఇండియాలో టాప్ 10 ఓటీటీ యాప్స్ లో ఒకటిగా నిల్చింది. ప్రారంభించన కొద్ది కాలంలోనే ఇండియా లో టాప్ 10 ఓటీటీ యాప్స్ లో ఒకటిగా నిల్చింది.సరికొత్త టాక్ షోస్ మరియు ఆసక్తికరంగా ఆహా ఒరిజినల్ వెబ్ సిరీస్ మరియు ఎంటర్టైన్మెంట్స్ షోస్ తో అనతి కాలం లోనే ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్ళింది.

 లేటెస్ట్ గా విడుదలవుతున్న సినిమాలు కూడా ఇందులో అప్లోడ్ అవటమే కాకుండా... అందులో చేస్తున్న షోలు సైతం క్లిక్ అవుతున్నాయి. తాజాగా నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK ‘ రెండు సీజన్స్ సూపర్ హిట్ అవ్వడం, పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు మరియు ప్రభాస్ వంటి హీరోలు ఈ టాక్ షో కి ముఖ్య అతిథులుగా రావడం తో ఆహా ని వినియోగించే కస్టమర్ల సంఖ్య అమాంతం పెరిగిపోయింది.

 ఇలా డిజిటల్ ప్రపంచం లో సంచలనం సృష్టించిన ‘ఆహా మీడియా’ ఇప్పుడు దిన పత్రిక రూపం లో అతి త్వరలో మన ముందుకి రాబోతుందని,ఆహా మీడియా ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది.తమ దినపత్రిక ఎలా ఉంటుందో నమూనా తో సహా అప్లోడ్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.

View post on Instagram


కేవలం ఆన్లైన్ ప్రేక్షకులకు మాత్రమే పరిమితమైన ఆహా మీడియా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ ఇంటి గడప తొక్కనుందని ప్రకటించారు. జులై 1 వ తేదీ నుండి ‘ఆహా’ దినపత్రిక అందుబాటులోకి రాబోతుందని...దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన నేడు ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియచేసింది ‘ఆహా’ టీం.ఈ దినపత్రికలో రాజకీయాలు, సినిమాలు , క్రీడలు, వ్యాపారం వంటి క్యాటగిరీలు మాత్రమే కాకుండా, రోజుకో ప్రముఖ టాప్ సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయని అన్నారు. అయితే నిజంగానే ఈ పత్రిక వస్తుందా లేక ఏప్రిల్ ఫూల్ ని చేసారా...అనేది మాత్రం తెలియటం లేదు. చాలా మంది అలాంటి పత్రిక ఏమీ రాదు..కేవలం ఏప్రిల్ ఫూల్ కోసమే చేస్తున్నారని అంటున్నారు. మరి కొందరు అయితే పేపరే బెస్ట్..యాప్ కాదు కాబట్టి హ్యాంగ్ అయ్యే సమస్య లేదని వెటకారం చేస్తున్నారు.