Asianet News TeluguAsianet News Telugu

శిరోముండనం కేసు లో నూతన నాయుడు, ఏం జరిగింది?

తమ ఇంట్లో పని మానేశాడన్న నెపంతో నూతన్‌కుమార్‌ నాయుడు భార్య మధుప్రియ.. కర్రి శ్రీకాంత్‌ అనే యువకుడికి శిరోముండనం చేయించిందని. ఈ  ఘటన శుక్రవారం చోటు చేసుకుందని చెప్తున్నారు. తనకు జరిగిన అవమానంపై బాధితుడు పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. 
 

Allegations Against Bigg Boss 2 Nutan Naidu
Author
Hyderabad, First Published Aug 29, 2020, 9:59 AM IST


తెలుగు బిగ్ బాస్ సీసన్ 2 కంటెస్టెంట్ నూతన్ నాయుడు రీసెంట్ గా దర్శకుడుగా మారి పరాన్నజీవి అనే సినిమా రూపొందించారు. ఆయన ఇప్పుడు ఓ వివాదంలో ఇరుక్కున్నారు. నూతన్‌ నాయుడు ఇంట్లో ఓ దళిత యువకుడికి ఘోర అవమానం జరిగిందంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

ఆ వార్తల సారాంశం ...తమ ఇంట్లో పని మానేశాడన్న నెపంతో నూతన్‌కుమార్‌ నాయుడు భార్య మధుప్రియ.. కర్రి శ్రీకాంత్‌ అనే యువకుడికి శిరోముండనం చేయించిందని. ఈ  ఘటన శుక్రవారం చోటు చేసుకుందని చెప్తున్నారు. తనకు జరిగిన అవమానంపై బాధితుడు పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు మీడియాలో ప్రచారం జరుగుతున్న దాన్ని బట్టి... విశాఖ జిల్లా పెందుర్తి సమీపంలో గిరిప్రసాద్‌నగర్‌లోని నూతన్‌కుమార్‌ నాయుడు ఇంట్లో కర్రి శ్రీకాంత్‌ అనే యువకుడు నాలుగు నెలల క్రితం పనికి చేరాడు. వ్యక్తిగత కారణాలతో ఆగస్టులో పని మానేశాడు. అయితే శుక్రవారం శ్రీకాంత్‌కు నూతన్‌కుమార్‌ భార్య మధుప్రియ ఫోన్‌ చేసి ‘నువ్‌ సెల్‌ఫోన్‌ తీశావు.. ఇంటికిరా మాట్లాడాలి’ అని పిలిచింది.  

అక్కడకు వెళ్లిన శ్రీకాంత్‌ను నిర్బంధించి అతడిపై తప్పుడు ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న సెలూన్‌ నిర్వాహకుడు రవిని పిలిపించి మధుప్రియ సమక్షంలో శ్రీకాంత్‌కు శిరోముండనం చేయించారు. తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీకాంత్‌ పెందుర్తి పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు వెస్ట్‌ ఏసీపీ శ్రావణ్‌కుమార్, ఎస్సీ, ఎస్టీ విభాగం ఏసీపీ త్రినా«థ్‌ పెందుర్తి పీఎస్‌కు చేరుకుని బాధితుడితో మాట్లాడారు. అతడి వాంగ్మూలం మేరకు నిందితురాలు మధుప్రియ సహా నలుగురిని జరిగిన ఘటనపై విచారిస్తున్నారు.  
 
ఇక ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు సాగుతోందని విశాఖ సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా తెలిపారు. ఘటనను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లామని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ చెప్పారు. తననేమైనా చేస్తారని భయంగా ఉందని, ప్రభుత్వం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని బాధితుడు కర్రి శ్రీకాంత్‌కోరినట్లు తెలుస్తోంది.  

Follow Us:
Download App:
  • android
  • ios