Asianet News TeluguAsianet News Telugu

రవిబాబు అడల్ట్ మూవీ ‘క్రష్’ రిలీజైంది,ఎలా ఉందంటే...

ఇటీవల సెన్సార్‌కి వెళ్ళిన ఈ చిత్రానికి కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని, వాటికి సెన్సార్ సభ్యులు కట్స్ ఇచ్చారట. వాటిని కట్ చేస్తే సినిమా ఫ్లో దెబ్బతింటుందని దర్శకుడు రవిబాబు భావించి, కట్స్‌కి అంగీకరించలేదట. ఓటీటీ ఆప్షన్ ఉండటంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యాడట.

Allari Ravi Babus latest movie titled Crush released jsp
Author
Hyderabad, First Published Jul 10, 2021, 10:07 AM IST

బూతులోనే భవిష్యత్తు ఉందని అల్లరి రవిబాబు నమ్ముతున్నట్లున్నాడు. తను వరసగా చేసిన సినిమాలు ఏవీ ఆడకపోవటంతో.. ఓ అడల్ట్ కామెడీకు రంగం సిద్దం చేస్తున్నాడు. ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై స్వీయ నిర్మాణంలో ఆయన క్రష్ అనే చిత్రాన్ని రూపొందించి ఓటీటిలో రిలీజ్ చేసారు.  ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథనాలు ఎంచుకునే రవిబాబు ఈసారి యుత్ ని టార్గెట్ చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.  
  
ఈ సినిమాని మొదట థియోటర్ లోనే రిలీజ్ చేద్దామనుకున్నారు. అందులో భాగంగా ‘క్రష్’ ఇటీవల సెన్సార్ కు వెళ్ళింది. అందులో అభ్యంతరకర సన్నివేశాలు బాగానే ఉండటంతో సెన్సార్ సభ్యులు మొత్తం తొమ్మిది కట్స్ ఇచ్చారని తెలిసింది. అయితే వాటిని కట్ చేస్తే సినిమా ఫ్లో దెబ్బతింటుందని భావించిన రవిబాబు… అందుకు అంగీకరించలేదట. దాంతో అంతా రవిబాబు రివైజింగ్ కమిటీకి వెళ్తాడేమో అనుకున్నారు. కానీ రివైజింగ్ కమిటీ కి కాకుండా రవిబాబు ఓటీటీ బాట పట్టారు. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలను సెన్సార్ చేయాల్సిన పనిలేదని తెలుసుకుని జీ5 లో రిలీజ్ చేసారు. అక్కడైతే తన సినిమాను ఎలాంటి కట్స్ లేకుండానే వీక్షకులకు చూపించొచ్చు అని రవిబాబు భావించారు.

 ఈ అడల్ట్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ ను  జీ 5  సంస్థ సొంతం చేసుకుని జూలై 9వ తేదీ స్ట్రీమింగ్ చేసింది. అమెరికా వెళ్ళాలనుకునే ముగ్గురు కుర్రాళ్ళు లైంగిక అనుభవం ముఖ్యమని భావించి ఏం చేశారనే కాన్సెప్ట్ తో ఈ అడల్ట్ కామెడీ మూవీ తెరకెక్కింది. అమెరికా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్న ముగ్గురు వర్జిన్ యువకులకు అమెరికా నుంచి వచ్చిన కజిన్ ఓ సలహా ఇస్తాడు. వర్జిన్ లను అక్కడ అమ్మాయిలు పట్టించుకోరని ఎక్స్పీరియన్స్ కావాలని ఆతనిచ్చిన సలహా ప్రకారం, ఆ ముగ్గురు స్నేహితులు చేసే ప్రయత్నమే ఈ సినిమా కథాంశం.  కండోమ్ వాడకం.. యాంగిల్స్ గురించీ దర్శకుడు ఈ సినిమాలో ఎక్కువ ప్రయారిటీ ఇవ్వటంతో ..ఇదొక బూతు సినిమా అనే కామెంట్స్ వస్తున్నాయి.

ఫ్లయింగ్ ఫ్రాగ్స్ పతాకంపై రవిబాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాలో అభయ్ సింహా, కృష్ణ బూరుగుల, చరణ్‌ సాయి, అంకిత మనోజ్, పాండే, శ్రీసుధా రెడ్డి కీలక పాత్రలు పోషించారు. హారర్, థ్రిల్లర్, కామెడీ జానర్స్ లో సినిమాలు తీసిన రవిబాబు… గతంలోనూ ఈ తరహా మూవీస్ కొన్ని తీశాడు కానీ… ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో అడల్ట్ కంటెంట్ నే నమ్ముకున్నాడని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios