అల్లరోడిగా వెండితెరపై నవ్వులు పూయించిన అల్లరి నరేష్ ప్రస్తుతం వైవిధ్యమైన చిత్రాలు ఎంచుకుంటున్నాడు. కథా బలం, నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలు చేస్తున్నాడు.
అల్లరోడిగా వెండితెరపై నవ్వులు పూయించిన అల్లరి నరేష్ ప్రస్తుతం వైవిధ్యమైన చిత్రాలు ఎంచుకుంటున్నాడు. కథా బలం, నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలు చేస్తున్నాడు. ఇటీవల అల్లరి నరేష్ నటించిన నాంది, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం చిత్రాలలో అల్లరి నరేష్ నటనకు ప్రశంసలు దక్కాయి.
తాజాగా అల్లరి నరేష్ నటిస్తున్న చిత్రం ఉగ్రం. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సాహు గరపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. అల్లరి నరేష్ యాక్షన్ అవతారంలో కనిపించింది చాలా తక్కువ. ఉగ్రంలో అల్లరి నరేష్ సర్ప్రైజ్ చేయబోతున్నాడు.
అల్లరి నరేష్ ఈ చిత్రంలో యాంగ్రీ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా చిత్ర యూనిట్ టీజర్ రిలీజ్ చేసింది. కామెడీ రోల్స్ లో ప్రేక్షకులు అల్లరి నరేష్ ని ఎక్కువగా చూసారు. వారికి ఈ టీజర్ ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే అల్లరి నరేష్ పోలీస్ ఆఫీసర్ ఆ శత్రువులని చీల్చి చెండాడుతూ కనిపిస్తున్నాడు.

'నాది కానీ రోజు కూడా ఇలాగే నిలబడతా' అంటూ అల్లరి నరేష్ చెబుతున్న డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. అల్లరి నరేష్ కి జోడిగా మీర్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఏప్రిల్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.
