టాలీవుడ్ కామెడీ హీరోగా ఎన్నో సినిమాలు చేసిన అల్లరి నరేష్ ఈ మధ్య కాలంలో హీరోగా సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఆయన నటించిన 'మహర్షి' సినిమా మంచి సక్సెస్ అందుకుంది.

దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కంటిన్యూ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో రవితేజతో సినిమా చేయడానికి అంగీకరించాడని టాక్. దర్శకుడు వి.ఐ.ఆనంద్ రూపొందిస్తోన్న 'డిస్కో రాజా' సినిమాలో రవితేజ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ముఖ్య పాత్ర కోసం అల్లరి నరేష్ ని ఎంపిక చేసినట్లు సమాచారం.

ముందుగా ఈ పాత్ర కోసం సునీల్ ని అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వలన అల్లరి నరేష్ ని ఫైనల్ చేశారు. థ్రిల్లర్ నేపధ్యంలో ఈ సినిమా సాగనుంది. పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ లు హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్మెంట్స్  బ్యానర్‌పై రామ్ తాళ్ళూరి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.