అల్లరి నరేష్ మూవీ టీంలో కరోన కలకలం.. క్లారిటీ ఇచ్చిన చిత్రయూనిట్
లాక్ డౌన్ సడలింపులు ఇవ్వటంతో తిరిగి అల్లరి నరేష్ నాంది సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో మూడు రోజుల పాటు షూటింగ్ చూశారు. అయితే బుధవారం అర్ధాంతరంగా షూటింగ్ నిలిపి వేశారు.
టాలీవుడ్ యంగ్ హీరో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం నాంది. ప్రముఖ దర్శకుడు సతీష్ వేగేశ్న ఎస్‌వీ 2 బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకుడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో నరేష్ అండర్ ట్రయల్ ఖైదీగా కనిపిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లాక్ డౌన్‌కు ముందే ఈ సినిమా షూటింగ్ 80 శాతానికి పైగా పూర్తయ్యింది. ఇటీవల లాక్ డౌన్ సడలింపులు ఇవ్వటంతో తిరిగి షూటింగ్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో మూడు రోజుల పాటు షూటింగ్ చూశారు. అయితే బుధవారం అర్ధాంతరంగా షూటింగ్ నిలిపి వేశారు. దీంతో యూనిట్‌లో కరోనా కలకలం కారణంగానే షూటింగ్ ఆపేసినట్టుగా ప్రచారం జరిగింది.
అయితే ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది చిత్రయూనిట్. యూనిట్ సభ్యులకు కరోనా వచ్చిందన్న వార్తలను యూనిట్ సభ్యులు ఖండించారు. వర్షం పడిన కారణంగానే షూటింగ్‌ను ఆపేసామని, ఎలాంటి వదంతులు నమ్మవద్దని క్లారిటీ ఇచ్చారు నాంది టీం. అల్లరి నరేష్ 57వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్‌కుమార్, హరీష్ ఉత్తమన్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎక్కువగా కామెడీ రోల్స్ లో మాత్రమే కనిపించే నరేష్ ఈ సినిమాతో పూర్తి సీరియస్ రోల్‌లో కనిపించనున్నాడు.