Asianet News TeluguAsianet News Telugu

‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ కలెక్షన్స్ అంత దారుణమా? !

తమ సమస్యలు పరిష్కరించమని ఓ ఊరి ప్రజలంతా ప్రభుత్వానికి ఎదురు తిరిగితే అదే ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా.    

Allari naresh Itlu Maredumilli Prajaneekam fails to work at the BoxOffice
Author
First Published Nov 28, 2022, 4:45 PM IST

అల్లరి నరేష్ హీరోగా నటించిన చిత్రం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఏఆర్ మోహన్ దర్శకత్వంలో గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి డివేడ్ టాక్ వచ్చింది. ఓపినింగ్స్ కూడా తెచ్చుకోలేకోలేకపోయిన ఈ చిత్రం తొలి రోజు రోజు కలెక్షన్లు   ఆశించిన స్థాయిలో రాలేదు. అయితే, వీకెండ్‌లో బాగుంటుందని ఎదురుచూసారు. కానీ ఆ టైమ్  లో  కూడా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా క్లిక్ కాలేదు. థియేటర్స్ లో ఆక్యుపెన్సీ  రేటు చాలా తక్కువగా ఉంది. రిలీజ్ ఖర్చులు కూడా రావటం లేదని ట్రేడ్ అంటోది.  ఈ సినిమాకి పోటీగా వచ్చిన మరో చిత్రం ‘లవ్ టుడే’ హిట్ కావడంతో ఆ సినిమా పైనే ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.   

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం చిత్రంలో కథే కాదు సినిమా సైతం  పూర్తి స్దాయి కష్టాలోనే ఉంది. ఎమోషనల్ సోషల్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం వీకెండ్ దాటలేకపోయింది అంటే మిగిలిన వారం అంతా ఇంకేమీ లేనట్లే అని తేల్చేస్తోంది ట్రేడ్.  నిర్మాతకు బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టం. ఇంట్రెస్టింగ్ గా సాగని ట్రీట్మెంట్ తో పాటు బోర్ గా సాగే కథనం, స్లో నేరేషన్ సినిమా ఫలిత్తాన్ని దెబ్బ తీసింది అంటున్నారు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ నాలుగు కోట్ల వ‌ర‌కు జ‌రిగిన‌ట్లు తెలిసింది. నాంది స‌క్సెస్ త‌ర్వాత అల్ల‌రి న‌రేష్ హీరోగా న‌టించిన సినిమా కావడంతో బిజినెస్ బాగా జరిగినట్లు చెబుతున్నారు. కానీ ఆ అంచనాలను సినిమా అందుకోలేకపోయింది. అసలు రికవరీ లేనట్లే. అల్లరి నరేష్ కు ఉన్న కామెడీ మార్కెట్ సైతం నాందీ, ఈ సినిమాతో తుడిచిపెట్టిపోయింది. ఇప్పుడు కేవలం ప్రయోగాత్మక, సీరియస్ సినిమాలపైనే నరేష్ దృష్టి పెడుతున్నారు.

మారేడుమిల్లి గిరిజ‌న ప్రాంతంలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే ప్ర‌భుత్వ ఉపాధ్యాయుడిగా అల్ల‌రి న‌రేష్ క‌నిపించాడు. ఆనంది హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాలో వెన్నెల‌కిషోర్‌, సంప‌త్ కీల‌క పాత్ర‌లు పోషించారు. తమ సమస్యలు పరిష్కరించమని ఓ ఊరి ప్రజలంతా ప్రభుత్వానికి ఎదురు తిరిగితే అదే ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా.  

విద్య, వైద్యం, రవాణా సదుపాలను కల్పించాలని ఏళ్లుగా విజ్ఞప్తి చేసిన పట్టించుకోని ప్రభుత్వానికి బుద్ది చెప్పేందుకు అధికారులను నిర్భంధిస్తే ఎలా ఉంటుంది? అనే పాయింట్‌తో దర్శకుడు ఈ కథను రాసుకున్నాడు. డైరెక్టర్‌ ఎంచుకున్న పాయింట్‌ రొటీనే అయినా.. అందరికి కనెక్ట్‌ అయ్యేలా చేయడంలో సఫలం అయ్యాడు. సినిమాలో కొత్తగా చెప్పిన విషయమేమి ఉండదు కానీ.. అందరిని ఆలోచింపజేస్తుంది. కంప్యూటర్‌ యుగంలోనూ.. కనీస సదుపాయాలు లేకుండా ఇబ్బంది పడేవారున్నారని ఈ సినిమా మరోసారి గుర్తు చేస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios