కామెడీ రూటు వదలిపెట్టి సీరియస్ గా సినిమాలు చేస్తున్నాడు అల్లరినరేష్. ఈఫార్ములా వర్కౌట్ అవ్వడంతో కంటీన్యూ అవుతున్నాడు. వరుస ఫెయిల్యూర్స్ వచ్చినా..అదరక బెదరక సినిమానే నమ్ముకుని ఉన్నాడు నరేష్. తాజాగా ఈ కామెడీ స్టార్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  తన సినిమాల గురించి తపై వస్తున్న విమర్షల గురించి కామెంట్లు చేశాడు నరేష్. 

కామెడీ రూటు వదలిపెట్టి సీరియస్ గా సినిమాలు చేస్తున్నాడు అల్లరినరేష్. ఈఫార్ములా వర్కౌట్ అవ్వడంతో కంటీన్యూ అవుతున్నాడు. వరుస ఫెయిల్యూర్స్ వచ్చినా..అదరక బెదరక సినిమానే నమ్ముకుని ఉన్నాడు నరేష్. తాజాగా ఈ కామెడీ స్టార్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన సినిమాల గురించి తపై వస్తున్న విమర్షల గురించి కామెంట్లు చేశాడు నరేష్. 

తాజాగా ఉగ్రం సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు అల్లరి నరేష్. మే 5న ఈసినిమా థియేటర్లలో సందడి చేయబోతోంది. నాంది సినిమాతో.. తన సినిమాల ఫార్ములాను మార్చేసిన అల్లరి నరేష్. సీరియస్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వస్తున్నాడు. లాంగ్ గ్యాప్ తరువాత నాందిసినిమాతో తనకు మంచి కమ్ బ్యాక్ ఇచ్చిన విజయ్ కనకమేడల దర్శకత్వంలోనే ఉగ్రం సినిమా చేశాడు అల్లరి నరేష్.

ఇక ఈసినిమా ప్రమోషన్ లో జోరుగా తిరుగుతున్నాడు అల్లరి నరేష్. ఈసందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తనకెరీర్ గురించి కూడా ప్రశ్నలు రాగా..సూటిగా స్పందించారు అల్లరి నరేష్. నేను నా కెరీర్ లో 60 సినిమాలు చేశాను, 60 శుక్రవారాలు చూశాను, హీరోగా నా కెరీర్ గురించి చాలామంది చాలా మాటలు అన్నారు. కాని నేను ఏ విషయాన్ని పట్టించుకోలేదు. పట్టించుకుని ఉంటే.. నా లైఫ్ అక్కడికే ఎండ్ అయ్యి ఉండేది. 

ఇదంతా కాదు. ఏది ఏమైనా... నేను నటనను వదిలే ప్రసక్తే లేదు. నేను చనిపోతేనే నా కెరీర్ అయిపోయినట్లు. అప్పటి వరకు నేను సినిమాలు చేస్తూనే ఉంటాను అన్నారు. నా ఊపిరి ఉన్నంత వరకూ నటిస్తూనే ఉంటాను అన్నారు. ఇక ఉగ్రం మూవీ ప్రమోషన్స్ తో బజిగా ఉన్న నరేష్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మంచి పాత్రలు పడితే చేయాలి అని చూస్తున్నాడు. ఆమధ్య మహర్షిలో మహేష్ బాబు ఫ్రెండ్ గా నటించాడు. ఇకు తాజాగా నాగార్జున సినిమాలో కూడా విలన్ గా నటించబోతున్నాడు అని టాక్ వినిపిస్తుంది. 

పడిలేచే కెరటంలా సాగుతుంది అల్లరి నరేష్ మూవీ కెరీర్. టాలీవుడ్ సీనియర్ దర్శకుడు దివంగత ఈవీవీ సత్యనారాయణ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన నరేష్... కామెడీ హీరోగా వరుస సినిమాలు చేశాడు. తన రేంజ్ హిట్లు కొడుతూ వచ్చాడు నరేష్. అల్లరి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడం మూలంగా .. అల్లరి నరేష్ గా అతనికి పేరు ఫిక్స్ అయ్యింది.

కామెడీ సినిమాలు వరసపెట్టి ఫుల్ పాపులారిటీ సొంతం చేసుకున నరేష్... 2012లో సుడిగాడు తో హిట్ కొట్టాడు. అప్పటినుంచి దాదాపు తొమ్మిదేళ్లపాటు ఎన్ని సినిమాలు చేసినా ఒక్కటంటే ఒక్కదానితోనూ హిట్ అందుకోలేకపోయాడు. దీంతో నరేష్ కెరీర్ అయిపోయిందని విమర్శలు వచ్చాయి. అంతే కాదు నరేష్ ఇక సినిమాలు చేయడు అంటూ చాలా అవమానాలు కూడా ఫేస్ చేశాడు నరేష్.