అల్లరి నరేష్‌ ఎట్టకేలకు హిట్‌ కొట్టాడు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆయన హిట్‌ పడింది. ఇన్నాళ్లు ఎన్నో ఆటుపోట్లని ఎదుర్కుంటూ, అపజయాల మూట గట్టుకుంటూ వస్తున్న అల్లరి నరేష్‌ తనలోని మరో యాంగిల్‌ని ఆడియెన్స్ కి పరిచయం చేసి హిట్‌ కొట్టాడు. తాజాగా ఆయన `నాంది` సినిమాతో తన కెరీర్‌కి కొత్త నాంది పలికారు. 

కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్‌ ఎట్టకేలకు హిట్‌ కొట్టాడు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆయన హిట్‌ పడింది. ఇన్నాళ్లు ఎన్నో ఆటుపోట్లని ఎదుర్కుంటూ, అపజయాల మూట గట్టుకుంటూ వస్తున్న అల్లరి నరేష్‌ తనలోని మరో యాంగిల్‌ని ఆడియెన్స్ కి పరిచయం చేసి హిట్‌ కొట్టాడు. తాజాగా ఆయన `నాంది` సినిమాతో తన కెరీర్‌కి కొత్త నాంది పలికారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా సక్సెస్‌ టాక్‌తో దూసుకుపోతుంది. 

విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో రూపొందిన `నాంది` సినిమాని సతీష్‌ వేగేశ్న నిర్మించారు. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కీలక పాత్రలో నటించారు. ఆమె ఇందులో లాయర్‌గా కనిపించారు. శుక్రవారం సినిమా విడుదలై అందరిచేత ప్రశంసలందుకుంటోంది. అల్లరి నరేష్‌‌ కుమ్మేశాడు. కెరీర్‌లో బెస్ట్ పర్‌ఫెర్మెన్స్ అంటూ ప్రశంసిస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత సక్సెస్‌ రావడంతో నరేష్‌ సైతం ఎమోషనల్‌ అవుతున్నాడు. తాజాగా శుక్రవారం ఏర్పాటు చేసిన సక్సెస్‌ సెలబ్రేషన్‌లో ఆయన మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. 

`2012 ఆగస్ట్ 24న `సుడిగాడు` రిలీజ్‌ అయ్యిందంటూ భావోద్వేగానికి గురయ్యాడు నరేష్‌. `చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. ఏడుపొచ్చేస్తుంది. ఇంత పెద్ద విజయం సాధించడానికి ఎనిమిదేళ్లు పట్టింది. కామెడీ సినిమాలు చేస్తూ వస్తున్నా, ఫ్లాపుల్లో ఉన్నా నన్ను ఓ నిర్మాత నమ్మాడు. అలాగే దర్శకుడు విజయ్‌ నాకు సెకండ్‌ బ్రేక్‌ ఇచ్చాడు. ఈ సినిమా కోసం అందరు కష్టపడ్డారు. ఇలాంటి కొత్త రకం సినిమా విజయవంతం అయితే ఇంకా ఇలాంటి మంచి కథలు వస్తాయి. వరలక్ష్మి లక్కీ సింబల్‌. ఆమె జనవరిలో `క్రాక్‌` తో హిట్‌ కొట్టారు. ఇప్పుడు `నాంది`తో మరో విజయానికి కారణమయ్యారు` అని ప్రశంసించారు నరేష్‌. 

ఇదిలా ఉంటే ఇందులో నరేష్‌ అద్భుతమైన నటనని చూపించి మెప్పిస్తే, అసలైన క్రెడిట్‌ మొత్తం వరలక్ష్మీ కొట్టేస్తుంది. నరేష్‌ కంటే వరలక్ష్మీ పాత్రకే ఎక్కువ ప్రశంసలు దక్కుతున్నాయి. ఇందులో ఆమె నటన పీక్‌లో ఉందంటూ సినీ వర్గాలే కాదు, అభిమానులు ప్రశంసిస్తున్నారు. `క్రాక్‌`లో జయమ్మగా, `నాంది`లో ఆధ్యగా నట విశ్వరూపం చూపించారని, ముఖ్యంగా `నాంది`లో లాయర్‌గా ఆమె ఏ గ్రేడ్‌ నటన చూపించారని అంటున్నారు. ఓ అండర్ ట్రయల్ ఖైదీ చుట్టూ తిరిగే కథ ఇది. తాను చేయని తప్పుకి ఎలా శిక్షకు గురయ్యాడు. దాన్నుంచి బయటపడేందుకు తాను పడ్డ స్ట్రగుల్‌, దాన్నుంచి ఎలా బయటపడ్డారనే కథాంశంతో, ప్రధానంగా సెక్షన్‌ 211 చుట్టూ తిరిగే కథ ఇది. కోర్ట్ చుట్టూ సినిమా సాగుతూ రక్తికట్టించింది ఆడియెన్స్ చేత ప్రశంసలందుకుంటోంది.