ఎవర్ గ్రీన్ సాంగ్స్ లో ఒకటైన స్వాతిలో ముత్యమంత పాటతో అల్లరి నరేష్ సరికొత్తగా దర్శనమిచ్చాడు. నేడు అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్బంగా ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థ విడుదల చేసిన బంగారు బుల్లోడు టీజర్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. 

బాలకృష్ణ బంగారు బుల్లోడు(1993) సినిమాలోని స్వాతిలో ముత్యమంత సాంగ్ అప్పట్లో ఎంతగా హిట్టయిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇప్పటికి కూడా అందరికి ఫెవరెట్ మెలోడీల్లో ఆ సాంగ్ కూడా ఒకటి. అయితే ఆ సాంగ్ లోని చిన్న క్లిప్ తో అల్లరి నరేష్ బంగారు బుల్లోడు గా ఆడియెన్స్ కి దర్శనమిచ్చాడు. 

గతకొంత కాలంగా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న నరేష్ రీసెంట్ గా మహర్షి సినిమాలో ఒక స్పెషల్ రోల్ లో కనిపించి మెప్పించాడు. ఇక సోలో హిట్ అందుకొని మళ్ళీ బిజీ అవ్వాలని అనుకుంటున్నాడు. త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమాకు గిరి దర్శకత్వం వహిస్తున్నాడు.