బిగ్ బాస్2: హౌస్ లో 'సిల్లీ ఫెలోస్'

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 9, Sep 2018, 12:31 PM IST
allari naresh and sunil in bigg boss house
Highlights

బిగ్ బాస్ సీజన్ 2 ఇప్పటికే 91 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. ఈ షోలో సినిమాల ప్రమోషన్స్ కూడా జరుగుతుంటాయి. ఆదివారం ఎపిసోడ్ లో 'సిల్లీ ఫెలోస్' ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చారు.

బిగ్ బాస్ సీజన్ 2 ఇప్పటికే 91 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. ఈ షోలో సినిమాల ప్రమోషన్స్ కూడా జరుగుతుంటాయి. ఆదివారం ఎపిసోడ్ లో 'సిల్లీ ఫెలోస్' ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చారు. అల్లరి నరేష్, సునీల్ లు కలిసి నటించిన 'సిల్లీ ఫెలోస్' సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సునీల్, నరేష్ లు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు. హౌస్ మేట్స్ అంతా రెండు గ్రూపులుగా విడిపోయి ఓ గేమ్ ఆడారు. ఒక గ్రూప్ కి అల్లరి నరేష్ నాయకత్వం వహించగా, మరో గ్రూప్ కి సునీల్ నాయకత్వం వహించారు.

హోస్ట్ నాని పెదరాయుడు అవతరమెత్తి ఈ రెండు గ్రూపులతో గేమ్ ఆడించారు. ఇలా అందరూ కలిసి షో మొత్తాన్ని ఎంటర్టైనింగ్ గా మార్చేశారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. 

loader