అల్లు అర్జున్ నేడు ఫ్యాన్స్ కి సూపర్ అప్డేట్ ఇచ్చాడు. పుష్ప షూటింగ్ డేటింగ్ ప్రకటించడంతో పాటు గ్లిమ్స్ ఆఫ్ వీడియో విడుదల చేశారు. సుకుమార్, అల్లు అర్జున్ ఈ వీడియోలో షూటింగ్ గురించి చర్చించుకుంటున్నారు.అలాగే అల్లు అర్జున్ మేకప్ టేబుల్ ముందు కూర్చొని ఉన్నారు.  దాదాపు ఏడు నెలలుగా పుష్ప షూటింగ్ హోల్డ్ లో పడింది. దర్శకుడు సుకుమార్ పుష్ప ఫస్ట్ షెడ్యూల్ కేరళలో షూట్ చేశారు. ఆ షెడ్యూల్ లో అల్లు అర్జున్ పాల్గొనలేదు. 

నెక్స్ట్ షెడ్యూల్ కూడా సుకుమార్ కేరళలో షూట్ చేయాలని భావించారు. ఐతే అప్పటికే కోవిడ్ కేసులు కేరళలో మొదలు కావడంతో పాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మొదలైపోయింది. దీనితో పుష్ప షూటింగ్ కి బ్రేక్ పడింది.ఇక రేపటి నుండి పుష్ప షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. తెలుగు రాష్ట్రాలలోనే పుష్ప షూటింగ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గోదావరి తీరాన ఉన్న నల్లమల అడవులలో పుష్ప షూటింగ్ జరగనుందట. పుష్ప షూటింగ్ కోసం నిన్ననే బన్నీ రాజమండ్రి వెళ్లినట్లు సమాచారం. 

మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా పుష్ప తెరకెక్కిస్తున్నారు. సుకుమార్ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. లారీ డ్రైవర్ గా బన్నీ డీగ్లామర్ రోల్ చేయడం మరో విశేషం. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం, దేవిశ్రీ అందిస్తున్నారు.