పాలిటిక్స్ లోకి వెళ్లి దాదాపు మూడేళ్ల విరామం అనంత‌రం ‘వకీల్​సాబ్’ తో  సినిమాల్లోకి రీఎంట్రీ  ఇచ్చారు పవర్​స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్. దాంతో అభిమానుల ఆనందానికి అంతేలేదు.ఈ క్రమంలో పవన్ కల్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిన చిత్రంగా ‘వకీల్​సాబ్’ రికార్డ్ నమోదు చేసింది. అయితే కరోనా సమస్యతో థియోటర్స్ నుంచి త్వరలోనే తప్పుకోవాల్సి వచ్చింది. థియేట్రికల్ రన్ పూర్తవడంతో ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ కు సిద్ధం అయ్యింది.ఈ క్రమంలో ఓటీటీలో ఏప్రిల్ 30న రిలీజ్ చేసారు. అక్కడ పరిస్దితి ఏమిటి..సినిమాని ..థియోటర్ స్దాయిలోనే ఆదరిస్తున్నారా వంటి విషయాలు చూద్దాం.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకు రికార్డ్ వ్యూస్ వస్తున్నాయి. మొదటి షో నుంచే ఓటీటి లో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియా అంతా ‘వకీల్ సాబ్’ ముచ్చట్లతో నిండిపోతున్నాయి. కరోనా భయంతో థియేటర్లలో ఈ సినిమాను మిస్సయిన వాళ్లు మాత్రమే ఈ సినిమా ని చూడటం లేదు. ఆల్రెడీ థియేటర్లలో చూసిన వాళ్లు కూడా విరగబడి ‘అమేజాన్ ప్రైమ్’లో ఈ సినిమాను చూస్తున్నట్లు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫ్యాన్స్ ఒక్కొక్కరు ..నాలుగైదు సార్లు చూస్తూంటారు. వారంతా ఇప్పుడు పోటీపడి అమేజాన్ లో ఈ సినిమాని చూస్తున్నారు. దాంతో సబ్ స్కైబర్స్ కూడా బాగా పెరుగుతున్నారు. అయితే ఈ సినిమా అప్పుడే పైరసీకు గురై ఒరిజనల్ వెర్షన్ నెట్ లో దొరకటం విషాదం.  

హిందీ ‘పింక్’ రీమేక్ గా తెర‌కెక్కిన ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్ తెలుగుకు అనుగుణంగా మార్పులు చేశారు. ముఖ్యంగా థమన్ అందించిన సంగీతం ఈ సినిమా విజయానిలో కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలో మగువ మగువ సాంగ్ మంచి ఆదరణ దక్కించుకుంది.ఈ సినిమాలో అంజలీ, అనన్య, నివేద థామస్ కీలక పాత్రలో నటించారు. శృతిహాసన్ చిన్న పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో పవన్ స్టైల్ కు ఆయన చెప్పిన డైలాగ్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. పవన్ కు ఈ సినిమా పర్ఫెక్ట్ కంబ్యాక్ అనే చెప్పాలి. ఇక ప్రకాష్ రాజ్ పోషించిన నంద పాత్ర సినిమాకు మరో హైలైట్ అనే చెప్పాలి.