ముందుగా ప్రకటించిన రెండు చిత్రాలను పక్కన బెట్టి ప్రశాంత్ నీల్ మూవీకి ముహూర్తం ఫిక్స్ చేశాడు ప్రభాస్. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కనున్న సలార్ మూవీ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం అయ్యింది. సంక్రాంతి కానుకగా జనవరి 15న సలార్ మూవీ హైదరాబాద్ లో అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ వేడుకకు పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. 

రేపు ఉదయం 11:00 గంటల నుండి ప్రారంభం కానున్న సలార్ పూజా కార్యక్రమంలో హీరో యష్ ప్రత్యేకంగా నిలువనున్నాడు. సలార్ లాంఛింగ్ ప్రోగ్రాం కి యష్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని సమాచారం. దీనితో సౌత్ కి చెందిన ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ ఒకే వేదికపై కనిపించడం ప్రత్యేకత సంతరించుకోనుంది. సౌత్ ఇండియా మొత్తంతో భారీ మార్కెట్ కలిగిన హీరోలుగా ప్రభాస్, యష్ ఎదిగిన విషయం తెలిసిందే. 

కెజిఎఫ్ సిరీస్ చిత్రాలను నిర్మించిన హోమబుల్స్ పిక్చర్స్ సలార్ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. నాగ్ అశ్విన్, ఓం రౌత్ లతో భారీ పాన్ ఇండియా చిత్రాలు ప్రకటించిన ప్రభాస్... ఆ రెండు చిత్రాలకంటే ముందు సలార్ పూర్తి చేయనున్నాడు. సలార్ పూర్తి స్క్రిప్ట్ తో పాటు పక్కా ప్లానింగ్ లో ఉన్న ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని నెలల వ్యవధిలో పూర్తి చేయనున్నాడని సమాచారం. మరో వైపు ప్రభాస్ రాధే శ్యామ్ షూటింగ్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.