యంగ్ హీరో నాగ శౌర్య సడన్ షాక్ ఇచ్చారు. ఆయన పెళ్ళికి సర్వం సిద్ధమైంది. బెంగూరులో నాగ శౌర్య వివాహం ఘనంగా జరగనుంది.  

కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. హీరో నాగ శౌర్య సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. మరో పది రోజుల్లో ఆయన పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఈ న్యూస్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. నాగ శౌర్య వివాహానికి బెంగుళూరులోని JW మార్రియట్ వేదిక కానుంది. రెండు రోజులు వివాహ వేడుక ఘనంగా జరగనుంది. నవంబర్ 19న మెహందీ వేడుక నిర్వహించనున్నారు. ఆ నెక్స్ట్ డే 20న ఉదయం 11:25 నిమిషాలకు పెళ్లి ముహూర్తం. శుభ ఘడియల్లో వధువు మెడలో నాగ శౌర్య తాళికట్టనున్నాడు. 

ఇక నాగ శౌర్య వివాహం చేసుకోబోయే అమ్మాయి పేరు అనూష అని సమాచారం. అనూష పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లా? లేక ప్రేమ వివాహమా? అనేది తెలియాల్సి ఉంది.ఇక నాగ శౌర్య ఇంటిలో పెళ్లి ఏర్పాట్లు మొదలైపోయాయి. బట్టలు నగలు షాపింగ్, బంధువులకు ఆహ్వానం వంటి పనుల్లో అందరూ నిమగ్నమయ్యారు. నాగ శౌర్య వివాహం బెంగుళూరులో జరుగుతున్న తరుణంలో పరిశ్రమ ప్రముఖులకు ఆహ్వానం ఉంటుందా? ఉన్నా వారు హాజరవుతారా? లేదా? అనేది చూడాలి. 

2011 లో విడుదలైన క్రికెట్ గర్ల్స్ అండ్ బీర్ మూవీతో నాగ శౌర్య సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. దర్శకుడు కమ్ యాక్టర్ శ్రీనివాస్ అవసరాల తెరకెక్కించిన ఊహలు గుసగుసలాడే మూవీతో నాగ శౌర్య ఫేమ్ తెచ్చుకున్నాడు. ఛలో నాగ శౌర్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ఉంది. సమంత బ్లాక్ బస్టర్ ఓహ్ బేబీ మూవీలో నాగ శౌర్య ఓ రోల్ చేశారు. విజయాలపరంగా వెనుకబడ్డ నాగ శౌర్య హీరోగా పలానా అబ్బాయి పలానా అమ్మాయి, నారి నారి నడుమ మురారి, పోలీస్ వారి హెచ్చరిక అనే చిత్రాలు తెరకెక్కుతున్నాయి.