నందమూరి బ్రదర్స్ కళ్యాణ్ రామ్, ఎన్టీఅర్ లను ఒకే స్టేజ్ మీద చూడడం అభిమానులకు ఆనందాన్నిచ్చే విషయం. ఆ ఫ్రేమ్ కోసం ఆశగా ఎదురుచూస్తుంటారు ఫ్యాన్స్. కానీ ఈ మధ్య కాలంలో ఈ అన్నదమ్ములు ఒక చోట కనిపించింది లేదు. కళ్యాణ్ రామ్ నటించిన 'ఎమ్మెల్యే' సినిమా ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ పాల్గొనలేదు. 'తమ్ముడు కొత్త సినిమా కోసం తన లుక్ ను మార్చుకున్నాడు. అందుకే ఈ ఈవెంట్ కు రాలేకపోయాడంటూ..'కళ్యాణ్ రామ్ 'ఎమ్మెల్యే' సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో చెప్పాడు. కానీ ఆ తరువాత ఎన్టీఆర్ పబ్లిక్ ఈవెంట్స్ లో బాగానే కనిపించాడు. రీసెంట్ గా 'మహానటి' సినిమాకు సంబంధించిన ఓ వేడుకకు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఆ చిత్ర నిర్మాత స్వప్నాదత్.. ఎన్టీఆర్ కు మంచి స్నేహితురాలు. ఆ కారణంగానే సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు ఎన్టీఆర్.

అయితే లేటెస్ట్ గా కళ్యాణ్ రామ్ నటించిన 'నా నువ్వే' సినిమా ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు ఎన్టీఅర్ వస్తాడని అభిమానులు ఆశించారు. కానీ అలా జరగలేదు. ఇతర వేడుకల కోసం ఎన్టీఆర్ తన సమయాన్ని వెచ్చిస్తున్నప్పుడు తన అన్నయ్య కోసం సమయాన్ని కేటాయించలేకపోతున్నాడా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఎన్టీఆర్ కావాలనే కళ్యాణ్ రామ్ ను అవైడ్ చేస్తున్నాడనేది కొందరి వాదన. అయితే కళ్యాణ్ రామ్ మాత్రం 'నా నువ్వే' ఆడియో ఫంక్షన్ లో ఎన్టీఆర్ గురించి కొన్ని మంచి విషయాలను ప్రస్తావించాడు.

దీన్ని బట్టి కళ్యాణ్ తన తమ్ముడితో ఎలాంటి విబేధాలు కోరుకోవడం లేదని తెలుస్తోంది. మరి ఎన్టీఆర్ మనసులోఏముందో..! 'జై లవకుశ' సినిమా విడుదలైన తరువాత వీరి మధ్య కొన్ని మాట పట్టింపులు వచ్చాయని అంటున్నారు. కనీసం అభిమానుల కోసమైనా ఈ ఇద్దరు అన్నదమ్ములు తిరిగి తమ బంధాన్ని కంటిన్యూ చేయాలని కోరుకుందాం!