సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట చిత్రం మే 12న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట చిత్రం మే 12న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిన్ననే హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. 

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక విషయం అందరికి సర్ ప్రైజ్ ఇచ్చింది. క్రేజీ డైరెక్టర్ సుకుమార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఒక అతిథిగా హాజరయ్యారు. సుకుమార్ హాజరైతే అందులో సర్ ప్రైజ్ ఏముంది అని అనుకోవచ్చు. అక్కడే ఉంది అసలు విషయం అంతా. 

వాస్తవానికి రంగస్థలం తర్వాత సుకుమార్.. మహేష్ బాబుతో సినిమా చేయాలి. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. దీనితో మహేష్, సుకుమార్ మధ్య విభేదాలు తలెత్తాయని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సుకుమార్, మహేష్ బాబు ఎక్కడగా కలవలేదు. 

మహేష్ సినిమా ఆగిపోవడంతో సుకుమార్.. బన్నీతో పుష్ప తెరకెక్కించాడు. సుకుమార్, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన 1 నేనొక్కడినే చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. కానీ ఆ చిత్రంలో సుకుమార్ టేకింగ్.. మహేష్ నటన వేరే లెవల్ లో ఉంటాయి. దీనితో సుకుమార్ సత్తా తెలిసిన మహేష్ ఫ్యాన్స్.. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాదా అనే ఆందోళనలో ఉన్నారు. 

సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సుకుమార్ హాజరు కావడం.. మహేష్ పై ప్రశంసలు కురిపించడంతో ఇద్దరి మధ్య విభేదాలు తొలిగిపోయినట్లే అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సో మహేష్ ఫ్యాన్స్ హ్యాపీ.