ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతోన్న భారీ చిత్రం 'RRR'. గత కొద్దిరోజులుగా ఈ సినిమాపై వస్తోన్న వార్తలపై దర్శకుడు రాజమౌళి తాజాగా క్లారిటీ ఇచ్చాడు. 

ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతోన్న భారీ చిత్రం 'RRR'. గత కొద్దిరోజులుగా ఈ సినిమాపై వస్తోన్న వార్తలపై దర్శకుడు రాజమౌళి తాజాగా క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాకి అన్ని భాషల్లో 'RRR'అనే టైటిల్ కామన్ గా ఉంటుందని, అయితే ఒక్కో భాషలో ఒక్కో ఎక్స్పాన్షన్ ఉంటుందని చెప్పారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

రామ్ చరణ్ పక్కన హీరోయిన్ గా అలియా భట్, ఎన్టీఆర్ కి జోడీగా విదేశీ భామ డైసీ ఎడ్గర్ జోన్స్ ని తీసుకున్నారు. అయితే 'RRR' సంస్థ తమ ట్విట్టర్ ద్వారా సినిమాలో అలియాభట్ నటిస్తుందని.. అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ మార్చి 15న పుట్టినరోజు జరుపుకోనున్న ఆమెకి అడ్వాన్స్ విషెస్ తెలిపింది.

ఈ ట్వీట్ కి స్పందించిన అలియా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. భారీ తారాగణం, అతడి పెద్ద టీంతో అందమైన ప్రయాణం ప్రారంభించడానికి వేచి ఉండలేకపోతున్నాను అంటూ వెల్లడించింది. ఈ సందర్భంగా రాజమౌళికి కృతజ్ఞతలు తెలిపింది.

Scroll to load tweet…