Asianet News TeluguAsianet News Telugu

మహేష్ కి జంటగా ఆర్ ఆర్ ఆర్ హీరోయిన్... రాజమౌళి అలా డిసైడ్ చేశాడా?

మరో భారీ బడ్జెట్ మూవీలో అలియా భట్ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తుంది. మహేష్ కి జంటగా రాజమౌళి అలియా భట్ ని ఎంపిక చేశారని సమాచారం అందుతుంది. 
 

alia bhatt to pair up with mahesh babu in rajamouli movie
Author
First Published Sep 16, 2022, 11:58 AM IST


రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సిద్ధం అవుతున్నారు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఆయన సూపర్ స్టార్ మహేష్ తో మూవీ చేయనున్నట్లు ఇది వరకే ప్రకటించారు. కథ కూడా ఫైనల్ కాగా... ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైనట్లు సమాచారం. మహేష్ కోసం రైటర్ విజయేంద్ర ప్రసాద్ యాక్షన్ అడ్వెంచర్ జోనర్ లో కథ సిద్ధం చేశారు. రాజమౌళి సైతం దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఇటీవల ఓ అంతర్జాతీయ వేదికపై మాట్లాడిన రాజమౌళి మహేష్ మూవీ గురించి పెదవి విప్పారు. ఇది ప్రపంచాన్ని చుట్టి వచ్చే ఓ సాహసికుడి కథ అన్నారు. జేమ్స్ బాండ్ మూవీ తరహాలో ఉండొచ్చని హింట్ ఇచ్చారు. 

ఈ క్రమంలో అంచనాలు మరింతగా పెరిగాయి. రాజమౌళి తన గత చిత్రాలకు మించి అత్యంత భారీగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కించనున్నారు. ప్రాజెక్ట్ వ్యయం రూ. 500 కోట్లకు పై మాటే అంటున్నారు. మహేష్ ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్ పట్ల విపరీతమైన ఆసక్తితో ఉన్నారు. కాగా ఈ మూవీకి గురించి మరొక ఇంట్రస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది. రాజమౌళి హీరోయిన్ గా అలియా భట్ ని ఎంపిక చేశారట. 

ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమర్ సందు ఈమేరకు ట్వీట్ చేశారు. మహేష్ కి జంటగా అలియా భట్ నటిస్తున్నట్లు వెల్లడించాడు. ఇక వచ్చే ఏడాది ప్రారంభంలో మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని చెప్పారు. ప్రస్తుతం గర్భంతో ఉన్న అలియా భట్ డెలివరీ తర్వాత రాజమౌళి మూవీ షూట్ లో పాల్గొంటారట. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది. 

ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీలో రామ్ చరణ్ కి జంటగా అలియా భట్ నటించారు. అయితే ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం నిరాశపరిచింది. ఈ విషయంలో అలియా భట్ కూడా నొచ్చుకున్నట్లు వార్తలు వచ్చాయి. మరి మహేష్ మూవీలో అయినా రాజమౌళి ఆమె టాలెంట్ కి సరిపోయే పాత్ర ఇస్తారేమో చూడాలి. మరోవైపు మహేష్ త్రివిక్రమ్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ మూవీ విడుదల కానుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios