తనగారాల పట్టి.. ముద్దుల కూతురు ఫోటోన్ సోషల్ మీడియాలో శేర్ చేసింది ఆలియా భట్. ప్రస్తుతం సినిమాలకు కాస్త విరామం ఇచ్చిన ఆలియా.. హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ప్రస్తుతం రెస్ట్ లో ఉంది. సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. తన కూతురి ఆలనా పాలన చూస్తూ.. మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది ఆలియా. స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ను పోయిన ఏడాది ఏప్రిల్ లో వివాహం చేసుకున్న ఆలియా భట్... వెంటనే ప్రెగ్నంట్ అంటూ అనౌన్స్ చేసేసింది. వీరిద్దరికి గత ఏడాది నవంబర్ లోనే ఒక ఆడపిల్ల కూడా జన్మించింది. ఆ పాపకి రహా అనే పేరుని కూడా పెట్టారు.
అయితే పాప పుట్టినప్పటి నుంచి తమ ఫ్యాన్స్ కు కాని.. ఆడియన్స్ కు కాని చూపించడంలేదు బాలీవుడ్ జంట. తమ టైమ్ అంతా పాపతో స్పెండ్ చేయడానికే కేటాయించారు. కాగా పాపకు రెండేళ్లు వచ్చే వరకు తమ కుమార్తె పేస్ ని సోషల్ మీడియాలో రివీల్ చేసేది లేదంటూ ఈ స్టార్ కపుల్ తమ సన్నిహితులతో చెప్పుకొచ్చారు. కాని రీసెంట్ గా ఒక పాప ఫోటోను అలియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. Ed-a-Mamma బేబీ వేర్ డ్రెస్సెస్ గురించి ప్రమోట్ చేస్తూ, పింక్ డ్రెస్ లో ఉన్న ఒక పాప ఫోటోని షేర్ చేసింది.
అయితే ఆ ఫోటో చూసిన సోషల్ మీడియా జనాలు మాత్రం.. ఆ పాప అలియా కూతురే అని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే నెటిజన్ల కామెంట్లు విని అయినా.. ఆలియా భట్ అసలు నిజం ఏంటో చెపుతుందా అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. అంతే కాదు మదర్ గా లైఫ్ ను తన కూతురుతో ఎంజాయ్ చేస్తున్న అలియా తన కూతురుకి 2 ఏళ్ళు వచ్చే వరకు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది.
అలియా ఆల్రెడీ నటించిన రెండు సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. ఇంగ్లీష్ ఫిలిం హార్ట్ అఫ్ స్టోన్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. దీంతో పాటు రణ్ వీర్ సింగ్ హీరోగా తెరకెక్కుతున్న రాకీ ఆర్ రాణికి ప్రేమ్ కహాని సినిమా కూడా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈమూవీ రొమాంటిక్ కామెడీ జానర్ లో తెరకెక్కింది. ఈ ఏడాది జులై 28న రిలీజ్ కాబోతుంది. ఇప్పటి వరకూ మరే సినిమాకు ఆలియా భట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
