బాలీవుడ్ లవర్ బాయ్ రన్బీర్ కపూర్ తో డేటింగ్ చేస్తుంది స్టార్ లేడీ అలియా భట్(Alia Bhatt). గత రెండేళ్లుగా వీరి పెళ్లి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అప్పుడు పెళ్లంటూ ఇప్పుడు పెళ్లంటూ కథనాలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా అలియా భట్ ప్రియుడు రన్బీర్ తో పెళ్లి గురించి సంచలన విషయం బయటపెట్టారు.

అలియా భట్ లేటెస్ట్ మూవీ గంగూబాయి కథియావాడి(Gangubai Kathiawadi) ఫిబ్రవరి 25న విడుదలైంది. దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ గంగూబాయి చిత్రానికి దర్శకత్వం వహించారు. పీరియాడిక్ బయోపిక్ గా గంగూబాయి చిత్రం తెరకెక్కింది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న అలియా భట్ కి అడుగడుగునా మీడియా నుండి పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎదురైంది. గత రెండేళ్లుగా ఆమె రన్బీర్ కపూర్ ని వివాహం చేసుకోనున్నట్లు వార్తలు వస్తుండగా.. మీడియా వర్గాలు స్పష్టత కోరాయి. మీడియా ప్రశ్నకు అలియా భట్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. 

పెళ్లి అనేది నా వ్యక్తిగత విషయం. ఎవరికీ సంబంధం లేనిది. నా మనసుకు సంబంధించిన వ్యవహారం. మానసిక ప్రశాంతత, సంతోషకర జీవితం కోసం పెళ్లి చేసుకుంటారు. ప్రస్తుతానికి నా మనసు ప్రశాంతంగా ఉంది. నేను, రన్బీర్ చర్చించుకుని ఇద్దరి అభిప్రాయాల ఆధారంగా పెళ్లి ఎప్పుడు అనేది నిర్ణయించుకుంటాము. నిజం చెప్పాలంటే నాకు రన్బీర్ తో మానసికంగా ఎప్పుడో వివాహం జరిగింది. నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడే ఆయనను వెండితెరపై చూసి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. నా పెళ్లి ఎప్పుడని మీరు పదే పదే అడగకండి... అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. 

ఏదో సాంప్రదాయం కోసమే పెళ్లి కానీ, మేము భార్యాభర్తలమే అన్నట్లుగా అలియా భట్ సమాధానం ఉంది. నిజంగా వీరిద్దరూ భార్యాభర్తలు లానే మెలుగుతున్నారు. ఇరు కుటుంబాలు సైతం బంధువుల మాదిరి మెదులుతున్నారు. రన్బీర్ కపూర్ (Ranbir kapooor)తో కలిసి ఏకాంత విహారాలు చేస్తున్నారు. గతంలో రన్బీర్ పలువురు హీరోయిన్స్ తో ప్రేమాయణం నడిపారు. దీపికా, ప్రియాంక, కత్రినా వంటి స్టార్ హీరోయిన్స్ ఈ లిస్ట్ లో ఉన్నారు. వారితో ఘాడమైన ప్రేమ కొనసాగించిన రన్బీర్ కపూర్ కొన్నాళ్ల తర్వాత బ్రేకప్ చెప్పారు. ఈ క్రమంలో కనీసం అలియానైనా పెళ్లి చేసుకుంటాడా? లేక గతంలో మాదిరి బ్రేకప్ చెబుతారా? అనేది అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. 

ఇక నేడు విడుదలైన గంగూబాయి మూవీలో అలియా భట్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. రెబల్ సెక్స్ వర్కర్ గా ఆమె నటన అద్భుతం అంటున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద అలియా భట్ గంగూబాయి మూవీ ఏ స్థాయి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.