Asianet News TeluguAsianet News Telugu

‘ఆర్‌ ఆర్ ఆర్‌’లో ఆలియా క్యారక్టర్ అంత చిన్నదా?

బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు RRR సినిమాలో అలియా పాత్ర చాలా చిన్నగా ఉంటుంది. ఈ విషయాన్ని రీసెంట్ గా ఓ ప్రెస్ కాన్ఫిరెన్స్ లో చెప్పింది.  మీడియా వారు ఆమె పాత్ర గురించి, సినిమాలో ఆ పాత్ర ప్రాముఖ్యత, హీరోలతో సమానంగా క్యారక్టర్   లెంగ్త్ ఉంటుందా ప్రస్తావించినప్పుడు ఆ విషయం బయిటకు వచ్చింది. 

Alia bhatt role in RRR
Author
Hyderabad, First Published Sep 3, 2019, 4:47 PM IST

ఎన్నో ఎక్సపెక్టేషన్స్ మధ్య ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్నతాజా చిత్రం 'ఆర్‌.ఆర్‌.ఆర్‌'. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమరం భీమ్‌గా ఎన్టీఆర్‌ కనిపించనున్నారు.  అలాగే 'ఆర్‌.ఆర్.ఆర్‌'లో చెర్రీ సతీమణిగా బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ నటిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆమె పాత్ర గురించి రకరకాల టాక్స్ వినపడుతున్నాయి. ఆమె ఫ్యాన్స్ అయితే తెగ ఎగ్జైట్ అవుతున్నారు. కానీ అంత సీన్ ఏమీ లేదని,  సినిమాలో అంత పెద్ద పాత్రమీ కాదని మీడియా వర్గాల సమాచారం. 

బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఆ సినిమాలో ఆమె పాత్ర చాలా చిన్నగా ఉంటుంది. ఈ విషయాన్ని రీసెంట్ గా ఓ ప్రెస్ కాన్ఫిరెన్స్ లో చెప్పింది.  మీడియా వారు ఆమె పాత్ర గురించి, సినిమాలో ఆ పాత్ర ప్రాముఖ్యత, హీరోలతో సమానంగా క్యారక్టర్   లెంగ్త్ ఉంటుందా ప్రస్తావించినప్పుడు ఆ విషయం బయిటకు వచ్చింది. 

అలియా మాట్లాడుతూ...నాకు ఇద్దరి దర్శకత్వంలో చేయాలనేది కల, వారిలో ఒకరు రాజమౌళి, మరొకరు సంజయ్ లీలా భన్సాలీ. వాళ్లద్దరూ నా డ్రీమ్ డైరక్టర్స్.  ఆర్ ఆర్ ఆర్ తో నా ఒక కోరిక తీరుతోంది. ఇలాంటప్పుడు నేను నా పాత్ర లెంగ్త్ ఎంతనేది ఎప్పుడూ పట్టించుకోను అంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడే దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళితో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నానని అని చెప్పుకొచ్చింది ఆలియా భట్‌. ఇది విన్న మీడియా వారు గస్ట్ కన్నా కొద్దిగా పెద్ద క్యారక్టర్ అని ప్రచారం చేస్తున్నారు. అయితే ఇందులో ఎంత వరకూ నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. 
  
అలాగే ఈ సినిమాపై ఎంత ప్రేమ పెంచుకుందంటే...తెలుగు నేర్చుకోవడానికి ఆలియా ట్యూటర్‌ను నియమించుకున్నారు. ఈ విషయం గురించి ఆలియా ఓ మీడియా తో మాట్లాడుతూ.. ‘తెలుగు నేర్చుకోవడం నాకో ఛాలెంజ్‌ అనే చెప్పాలి. భాష నేర్చుకోవడం చాలా కష్టంగా ఉంది. కానీ అన్ని భావాలను పండించగలిగే చక్కని భాష ఇది. ఆ పదాన్ని అలా ఎందుకు పలుకుతారు? ఇలా ఎందుకు అంటారు?వాటి అర్థమేంటి?వంటి విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నాను. 

అప్పుడే నా పాత్రకు పూర్తి న్యాయం చేయగలను. ఈ సినిమాను ఒప్పుకోవడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడే ముగ్గురు దర్శకులతో తప్పకుండా పనిచేయాలని నిర్ణయించుకున్నాను. వారిలో కరణ్‌ జోహార్, సంజయ్‌ లీలా భన్సాలీ, రాజమౌళి ఉన్నారు. కరణ్‌ నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇప్పుడు భన్సాలీ, రాజమౌళి సర్‌లతో పనిచేస్తున్నాను’ అని వెల్లడించారు ఆలియా.

భారీ బడ్జెట్‌తో నిర్మాత డీవీవీ దానయ్య సినిమాను నిర్మిస్తున్నారు.   2020 జులై 30 ‘ఆర్‌ ఆర్ ఆర్‌’ అన్ని భారతీయ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us:
Download App:
  • android
  • ios