బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందంతో పాటు చక్కటి అభినయం కనబరిచే ఈ బ్యూటీకి బాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉంది. అందుకే దర్శకుడు రాజమౌళి ఆమెని 'RRR' లో హీరోయిన్ గా తీసుకున్నాడు.

ఎన్టీఆర్, చరణ్ ల క్రేజ్ తో బాలీవుడ్ లో అనుకున్న స్థాయిలో మార్కెట్ అవ్వదు. ఆ కారణంగానే అలియాభట్ ని రంగంలోకి తీసుకొచ్చారు. అయితే ఈ సినిమా కోసం ఆమెకి ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారనే విషయంపై క్లారిటీ వచ్చింది.

దాదాపు 5 కోట్ల రూపాయలిచ్చి అలియాని కన్ఫర్మ్ చేశారు. ఆమె ఖర్చులు, ట్రాన్స్ పోర్ట్, హోటల్, పెర్సనల్ స్టాఫ్ కి సెపరేట్ గా పేమెంట్ ఉంటుంది. అలియాని తీసుకుంటే బాలీవుడ్ లో కచ్చితంగా సినిమాపై క్రేజ్ పెరుగుతుంది. అందుకే అన్ని కాంటాక్ట్స్ వాడి ఆమెని టాలీవుడ్ కి తీసుకొస్తున్నారు.

ఇటీవల వడోదరాలో షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రబృందం ఇప్పుడు షూటింగ్ కోసం పూణే వెళ్లనుంది. రామ్ చరణ్ కాలికి గాయం కావడంతో ఆయన ఈ షూట్ లో పాల్గొనే  అవకాశాలు లేవు.