`ఆర్‌ఆర్‌ఆర్` హీరోయిన్ ఇంట్లో విషాదం.. అలియాభట్ ఎమోషనల్ పోస్ట్
`ఆర్‌ఆర్‌ఆర్` హీరోయిన్ అలియాభట్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె తాతయ్య కన్నుమూశారు. ఈ సందర్భంగా ఆమె పెట్టిన ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

`ఆర్‌ఆర్‌ఆర్` హీరోయిన్, అలియాభట్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె తాతయ్య నరేంద్ర రజ్దాన్(93) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన వారం రోజులుగా ఆసపత్రిలో చికిత్స పొందుతూ, గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని అలియాభట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఆమె భావోద్వేగభరిత పోస్ట్ పెట్టింది. మా తాతయ్యనే, నా హీరో అంటూ ఆమె ఎమోషనల్ అయ్యింది.
ఇందులో అలియాభట్ చెబుతూ, మా తాతయ్య, నా హీరో, 93ఏళ్ల వయసులో కూడా గోల్ఫ్ ఆడావు, మొన్నటి వరకు కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నావు. నా కోసం టేస్టీ ఆమ్లెట్ చేశావు, నాకు బోలెడన్ని కథలు చెప్పావు, వయోలిన్ వాయించేవాడివి, నీ మునిమనవరాలితోనూ ఆడుకున్నావు, నీ క్రికెట్, నీ స్కెచ్‌లన్నా ఎంతో ఇష్టం. నీ చివరి క్షణం వరకు కుటుంబాన్ని ప్రేమించావు, చివరి వరకు నీ జీవితాన్ని నువ్వు ప్రేమించావు` అని వెల్లడించింది అలియాభట్.
ఇంకా చెబుతూ, నువ్వు లేవనే బాధతో నా హృదయం దుఖంతో నిండి ఉంది, కానీ ఆనందంతో కూడా నిండి ఉంది, ఎందుకంటే మా తాత చేసినదంతా మాకు ఆనందాన్ని అందించడమే, నీ సమక్షంలో, మీరందించిన వెలుగులో పెరిగినందుకు ఆశీర్వాదంగా, కృతజ్ఞతగా భావిస్తున్నా` అని తెలిపింది అలియాభట్. మనం మళ్లీ కలిసే వరకు లవ్యూ అంటూ బ్లాక్ లవ్ ఎమోజీని పంచుకుంది. ఇటీవల తాత నరేంద్ర పుట్టిన రోజు సందర్భంగా తీసిన వీడియోని ఈ సందర్భంగా పంచుకుంది అలియాభట్. అలియాభట్ భావోద్వేగ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
`ఆర్‌ఆర్‌ఆర్` చిత్రంలో సీతగా నటించి మెప్పించింది అలియాభట్. ఆమె గతేడాది తన ప్రియుడు రణ్‌బీర్ కపూర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఏప్రిల్‌లో మ్యారేజ్ కాగా, నవంబర్‌లో పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది అలియాభట్. చివరగా అలియాభట్ `బ్రహ్మాస్త్ర` మొదటి పార్ట్ లో నటించింది. ప్రస్తుతం `రాఖీ ఔర్ రాణి కి ప్రేమ కహాని`తోపాటు హాలీవుడ్ సినిమా `హార్ట్ ఆఫ్ స్టోన్` సినిమాలో నటిస్తుంది.