పెళ్ళై పట్టుమని పది రోజులు కాకుండానే అలియా తాను తల్లినంటూ ప్రకటన చేసింది. రెండు నెలలకే అలియా తల్లి కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నేషనల్ వైడ్ న్యూస్ అయ్యింది. ఈ కథలో మరో ట్విస్ట్ ఏంటంటే ఆమె కడుపులో పెరుగుతుంది కవలలట.
దాదాపు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న అలియా భట్(Alia Bhatt), రన్బీర్ కపూర్ 2022 ఏప్రిల్ 14న వివాహం చేసుకున్నారు. నిరాడంబరంగా అత్యంత సన్నిహితులు, కొందరు బాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో వీరి వివాహం ముగిసింది. ఇక పెళ్ళై రెండు నెలలు గడవకుండానే అలియా తాను గర్బవతిని అంటూ షాకింగ్ న్యూస్ పంచుకున్నారు. సాధారణంగా సెలెబ్రిటీ కపుల్స్ పెళ్లైన వెంటనే పిల్లల్ని కనడానికి ఇష్టపడరు. 2018లో వివాహం చేసుకున్న దీపికా-రణ్వీర్ సింగ్ ఇంత వరకు పిల్లల్ని కనలేదు. అలాంటిది వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న అలియా తల్లి కావడం ఒకింత ప్రాధాన్యత సంతరించుకుంది.
మరొక విశేషం ఏమిటంటే అలియా కడుపులో కవలలు పెరుగుతున్నారట. ఈ విషయాన్ని రన్బీర్ కపూర్(Ranbir Kapoor) పరోక్షంగా తెలియజేశారు. రన్బీర్ లేటెస్ట్ మూవీ షంషేరా. జులై 22న ఈ మూవీ విడుదల కానుంది. ఈ క్రమంలో రన్బీర్ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. కాగా ఓ ఇంటర్వ్యూలో రన్బీర్ యాంకర్ కి ఓ పరీక్ష పెట్టారు. తాను చెప్పే మూడు స్టేట్మెంట్స్ లో రెండు కరెక్ట్ స్టేట్మెంట్స్ గుర్తించాలి అన్నాడు. మొదటి స్టేట్మెంట్ గా అలియా కవలలకు జన్మను ఇవ్వబోతుంది, రెండవదిగా నేను ఓ పౌరాణిక చిత్రంలో నటించబోతున్నాను. ఇక మూడవ స్టేట్మెంట్ గా నేను సినిమాలు వదిలేయబోతున్నాను.. అని చెప్పాడు.
రన్బీర్ సినిమాలు వదిలేయడం అనేది జరగని పని కాబట్టి ఆయన చెప్పిన స్టేట్మెంట్స్ లో అది సరైనది కాదు. కాబట్టి మిగతా రెండు కరెక్ట్. రన్బీర్ కపూర్ పౌరాణిక చిత్రం చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు అందుతున్నాయి. ఇక రన్బీర్ చెప్పిన అలియా కవలలకు జన్మను ఇవ్వనుందనేది కూడా నిజమే అని తెలుస్తుంది. నిజంగా వాళ్లకు ఇది డబుల్ ధమాకా అని చెప్పాలి.
మరోవైపు అలియా తాను ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ చకచకా పూర్తి చేస్తున్నారు. ఇక రన్బీర్ కి జంటగా ఆమె నటించిన భారీ సోసియో ఫాంటసీ చిత్రం బ్రహ్మాస్త్ర విడుదలకు సిద్దమవుతుంది. సెప్టెంబర్ 9న మూవీ విడుదల కానుంది. నాగార్జున, అమితాబ్, మౌని రాయ్ ఈ మూవీలో కీలక రోల్స్ చేశారు. దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
