బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ తనకు కరోనా సోకినట్లు తెలియజేయడంతో ఆమె ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ తిన్నారు. కోవిడ్ పాజిటివ్ గా నాకు నిర్ధారణ అయ్యింది. తెలిసిన వెంటనే క్వారంటైన్ కావడంతో పాటు చికిత్స తీసుకుంటున్నాను. అలాగే తగు జాగ్రత్తలు పాటిస్తున్నాను. త్వరగా కోలుకొని తిరిగి వస్తాను. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు... అంటూ అలియా ఇంస్టాగ్రామ్ స్టేటస్ పోస్ట్ చేశారు. 


అలియా ప్రియుడు రన్బీర్ కపూర్ ఇటీవల కరోనా బారినపడ్డారు. ఆయన కోలుకున్న సమయంలో అలియాకు కరోనా సోకడం సంచలనంగా మారింది. ప్రస్తుతం అలియా రెండు భారీ చిత్రాలలో నటిస్తున్నారు. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న గంగూభాయ్ కటియావాడితో పాటు ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఆమె హీరోయిన్ గా నటిస్తున్నారు. అలియాకు కరోనా సోకిన కారణంగా ఈ రెండు చిత్రాలపై ప్రభావం పడే సూచనలు కలవు.

 
ముఖ్యంగా రాజమౌళిని ఇది టెన్షన్ పెట్టే అంశమే అని చెప్పాలి. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడం వలన, విడుదల రెండు సార్లు వాయిదా పడింది. దీనితో రాజమౌళి శరవేగంగా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. అలియాకు కరోనా నేపథ్యంలో కనీసం రెండు వారాల తరువాత మాత్రమే సెట్స్ కి రాగలరు. ఒకవేళ అలియా పై కీలక సన్నివేశాల చిత్రీకరణ ఉన్న నేపథ్యంలో షూటింగ్ కి బ్రేక్ పడుతుంది.