బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ పై సీక్రేట్ గా నజర్ ఉంచారు కొంత మంది. ఆమె ఎం చేస్తుందో తెలుసుకునే ప్రయత్నంచేశారు.
సెలబ్రిటీల లైఫ్ చాలా వరకూ సీక్రెట్ గా ఉంటుంది. ఇక వాళ్ల పర్సనల్ లైఫ్ లోకి ఎవరైనా తొంగి చూస్తే అస్సలు ఒప్పుకోరు స్టార్స్. బయట స్టార్ గా వారి ఫ్యాన్స్ కు ఎంత వరకైనా చనువు ఉంటుంది కాని... పర్సనల్ లైఫ్ లోకి వస్తే మాత్రం అస్సలు ఊరుకోరు. అయితే కొంత మంది మాత్రం సీక్రేట్ గా అయినా.. లేదా వాళ్ళను ఒప్పించి అయినా.. వారి గురించి తెలుసుకోవాలి అని చూస్తుంటారు. ఇంట్లో ఏం చేస్తున్నారో చూడాలని కుతూహలంగా ఉంటారు. ఇక ఈ క్రమంలోనే.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ పై సీక్రేట్ గా నజర్ ఉంచారు కొంత మంది.
ఆలియా ఇంట్లో ఏం చేస్తుంది. బయటకు రాకుండా ఇంట్లో ఉంటూ.. ఆమె చేసేది ఏంటీ అనే కుతూహలం ఉందో ఏమో..? అందుకే ఆమెను సీక్రేట్ గా వాచ్ చేస్తున్నారు. ఏకంగా ఆలియా ఇంట్లోకి సీక్రెట్ గా కెమెరాలు పెట్టేశారు. గమనిస్తూ కూర్చున్నారు. ఈ విషయాన్ని ఆలియా భట్ గమనించడంతో ఆమె జాగ్రత్త పడింది. అంతే కాదు అవతలి వాళ్ళకు షాకివ్వడం కూడా జరిగిపోయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన ఆలియా భట్. ఈ విధంగా పోస్ట్ లో రాసుకొచ్చింది.
నేను హ్యాపీగా ఇంటి పనిచేసుకుంటూ.. మధ్యాహ్నం టైంని సంతోషంగా ఇంట్లో గడుపుతున్నాను. అప్పుడు నన్ను ఎవరో ఫాలో చేస్తున్నట్లు అనిపించి మొత్తం చెక్ చేశాను. మా పక్కింటి టెర్రస్ పై ఇద్దరు వ్యక్తులు చేతిలో కెమెరాలు పట్టుకుని మా ఇంట్లోకి చూస్తున్నారు. ఇది మా ప్రైవసీకి భంగం కలిగించడమే ఇక చాలు లిమిట్ క్రాస్ చేశారు. నా ఇంట్లోకి కెమెరాలు పెడతారా?’ అని ఆలియా ఆవేదన వ్యక్తం చేసింది. ఇది చాలా దారణం అంటూ.. ఫైర్ అయ్యింది ఆలియా భట్.
ఇక ఈ విషయంలో ఆలియాకు బాలీవుడ్ నుంచి సపోర్ట్ లభిస్తుంది. చాలా మంది స్టార్లు అండగా నిలుస్తున్నారు. అర్జున్ కపూర్, అనుష్క శర్మ తదితరులు పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్ అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఇక ఆలియా భట్ బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ ను పెళ్ళాడింది. వెంటనే ఓ పాపకు కూడా జన్మనిచ్చింది. ఇప్పటికే సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆలియా భట్.. ఓ రెండేళ్లు మూవీస్ కు దూరంగా ఉంటూ.. తన కూతురి ఆలనా పాలనా చూసుకోవాలి అనుకుంటుంది
